News December 11, 2025

అన్నమయ్య: అందాల పోటీల్లో మెరిసిన షేక్ రీమా.!

image

అన్నమయ్య జిల్లా T.సుండుపల్లికి చెందిన షేక్ షాహీనా, షేక్ జహుద్ బాషా దంపతుల కుమార్తె ‘షేక్ రీమా’ అందాల పోటీలో అద్భుత ప్రతిభను కనబరింది. జైపూర్‌లో నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో షేక్ రీమాకు “మిస్ ఈకో ఇంటర్నేషనల్ ఇండియా 2025” కిరీటం దక్కింది. 2026లో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతినిధిగా కూడా ఆమె పాల్గొనబోతున్నారు. మోడలింగ్‌, క్రీడలు, నృత్యంలో రీమా చూపుతున్న బహుముఖ ప్రతిభ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Similar News

News December 11, 2025

హీరాపూర్‌: కోడలిపై అత్త విజయం

image

ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అత్తాకోడళ్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ రసవత్తర పోరులో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరిపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీబాయి 140 ఓట్ల తేడాతో గెలుపొందారు.

News December 11, 2025

PDPL: AICC జాతీయ అధ్యక్షుడిని కలిసిన ప్రముఖులు

image

AICCజాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, CM రేవంత్ రెడ్డిని మంత్రి వివేక్, పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ గురువారం HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిన ఆయన సూచించారు. తెలంగాణను దేశంలో ఒక మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దాలని ఖర్గే మార్గదర్శకం చేశారు.

News December 11, 2025

రాజాపూర్: మెజార్టీ పెంచిన రీ కౌంటింగ్

image

ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సొంతూరు రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెంలో బీజేపీ గెలుపొందింది. మొదట కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అంజలిపై 6ఓట్లతో బీజేపీ బలపర్చిన అభ్యర్థి కాటేపాగ రేవతి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు రీ కౌంటింగ్ కోరడంతో నిర్వహించిన రీకౌంటింగ్‌లో రేవతికి 36ఓట్ల మెజార్టీ లభించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో విషయం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమైంది.