News March 25, 2024

అన్నమయ్య: అన్న ఎంపీగా.. తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ

image

రాజకీయాల్లో నల్లారి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. అన్నదమ్ములైన కిరణ్, కిషోర్‌లు తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో వారికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. AP అసెంబ్లీ స్పీకర్, CMగా కిరణ్ బాధ్యతలు నిర్వర్తించారు. TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిషోర్ కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో పీలేరు అసెంబ్లీ స్థానానికి కిషోర్, రాజంపేట MP స్థానానికి కిరణ్ పోటీ పడుతున్నారు.

Similar News

News February 15, 2026

కడప: ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర

image

కడప జిల్లా శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి. అందులో ప్రధానంగా పొలతల, నిత్యపూజకోన, సంగమేశ్వర ఆలయం, ముక్కొండ, పుష్కగిరి, అల్లాడుపల్లెలో వీరభద్ర స్వామి దేవాలయం, గవిమల్లేశ్వరుని కొండ, లంకమల మొదలైన వాటిలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో చరిత్ర ఉండగా వేలల్లో భక్తులు దర్శించుకుంటారు. ఇప్పటికే ఆయా దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పర్వదినాన మీరు ఏ గుడికి వెళ్తున్నారు.

News February 14, 2026

కడప: పోలీసులుగా చలామణి అవుతూ మోసం

image

కడప చిన్నచౌక్ పోలీసులు ఆన్‌లైన్‌లో POLO, WALLA యాప్‌లతో ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన చదువుల కుమార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులుగా నటిస్తూ కేసులు పెట్టిస్తామని బెదిరించి, కేసుల నుంచి బయటపడేయాలంటే డబ్బులు ఇవ్వాలని నమ్మబలికి పలువురి నుంచి నగదు, బంగారం వసూలు చేసినట్లు విచారణలో బయటపడింది. వారి వద్ద రూ.4.5 లక్షల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

News February 14, 2026

గండికోటకు వెళ్తున్న ప్రేమ జంటకు ప్రమాదం.. యువతి మృతి.!

image

కడప నగర శివారులోని ఆలంఖాన్‌పల్లె సర్కిల్ వద్ద శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి గండికోటకు బైక్‌పై వెళ్తున్న ప్రేమజంటను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన సిరినా అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె ప్రియుడు గాయపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. కడప 2-టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.