News January 19, 2026
అన్నమయ్య: ఇందులో మీ ల్యాప్‌టాప్ ఉందా?

అన్నమయ్య జిల్లాలో ల్యాప్‌టాప్ దొంగ నరేశ్‌ను <<18897096>>అరెస్ట్ <<>>చేసిన విషయం తెలిసిందే. నిందితుడు జల్సాలకు అలవాటు పడ్డాడు. ఖర్చుల కోసం రెండేళ్లుగా తిరుపతి-బెంగళూరు, రాయచోటి-బెంగళూరు బస్సుల్లో దొంగతనాలు చేస్తున్నాడు. పోలీసులు అరెస్ట్ చేసి అతని ఇంట్లో సోదాలు చేశారు. 23 ల్యాప్‌టాప్‌లు దొరికాయి. మీలో ఎవరిదైనా ల్యాప్‌టాప్ పోయినట్లైతే సంబంధిత ఆధారాలను సంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో చూపించి వీటిని తీసుకోవచ్చు.
Similar News
News February 18, 2026
పాడేరు: ‘పింఛన్ పంపిణీలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు’

పింఛన్ పంపిణీలో అలసత్వం వహించకూడదని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పింఛన్ పంపిణీలో అవకతవకలు జరిగితే ఎంతటి అధికారికైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రెండు జిల్లాల అధికారులతో వీసీ నిర్వహించారు. పింఛన్ పంపిణీలో ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చే కాల్స్‌లో, లబ్దిదారులకు ఏ విధమైన ప్రశ్నకు సంతృప్తి చెందితే సమాధానంగా ఏ బటన్ ప్రెస్ చెయ్యాలో తెలియజేయాలని సూచించారు.
News February 18, 2026
ప్రమాదానికి ఏడాది.. మళ్లీ పనులు మొదలు

TG: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) తవ్వకం మళ్లీ మొదలైంది. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో టీబీఎం మెషీన్‌తో తవ్వకాలు జరుపుతుండగా టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. దీంతో మెషీన్ తవ్వకాలు నిలిపివేసి బ్లాస్టింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించి పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.
News February 18, 2026
తిరుపతి: మరోసారి మంచు విష్ణుకు నోటీసులు?

విద్యార్థి సంఘం నేతల <<19082321>>కిడ్నాప్<<>> కేసులో A-3 మంచు విష్ణుకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఇప్పటికే విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు అందజేయగా.. ఈ నెల 15 తర్వాత వస్తానని విష్ణు తెలిపారు. అయితే 17వ తేదీకి కూడా ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో మరోమారు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. హాజరు కాకపోవడానికి గల కారణాలపై స్పష్టత కోరుతూ సమన్లు జారీ అవకాశం ఉంది.


