News September 7, 2025
అన్నమయ్య: ఓ ఇంటిలోకి దూసుకెళ్లిన కారు

అన్నమయ్య జిల్లా కంటేవారిపల్లెలో కారు బీభత్సం సృష్టించింది. హార్సిలీహిల్స్‌కు వెళ్తున్న కారు ఆదివారం కురబలకోట మండలం కంటేవారిపల్లెలో అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. పలమనేరుకు చెందిన కొందరు యువకులు కారులో హార్సిలీహిల్స్‌కు బయలుదేరారు. కారు మార్గమధ్యంలో మండలంలోని కంటేవారిపల్లెలోని మనోహర్ అనే వ్యక్తి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు, బైక్, మట్టి కుండలు ధ్వంసమయ్యాయి.
Similar News
News September 8, 2025
ములుగు: నిండు కుండల్లా జలాశయాలు..!

ములుగు జిల్లాలోని జలాశయాలు నిండు కుండల్లా మారాయి. రామప్ప, లక్నవరం చెరువులు, మల్లూరు, పాలెంవాగు, గుండ్లవాగు ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో ఆయకట్టు పొలాలకు నీటి కొరత తీరినట్లే. ఒక్కసారి నిండితే రెండు పంటలకు సంవృద్ధిగా నీరు లభిస్తుంది. కానీ, లక్నవరం చెరువు, మల్లూరు ప్రాజెక్టుల్లో లీకేజీ కారణంగా జలాలు వృథాగా పోతున్నాయి. ప్రాధాన్యతగా మరమ్మతులు చేయాల్సి ఉంది.
News September 8, 2025
అనకాపల్లి: పోస్టుల ఖాలీ.. నిరుద్యోగులకు ‘పరీక్షే’..!

అనకాపల్లి జిల్లాలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. గ్రంథాలయ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ ఇన్‌ఛార్జ్‌లతో నడుస్తున్నాయి. ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న కోటవురట్ల లైబ్రేరియన్ స్థానంలో పాములవాక గ్రామీణ గ్రంథాలయ అధికారి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. అలాగే జిల్లాలో రాంబిల్లి, ఎస్.రాయవరం, ఏటికొప్పాక గ్రంథాలయ అధికారుల పోస్టులను భర్తీ చేయలేదు. జిల్లాలో పలుచోట్ల ఇదే పరిస్థితి.
News September 8, 2025
కాంపాళెం వారిదే పోలేరమ్మ జాతర!

పూర్వం కాంపాళెంలోనే పోలేరమ్మ జాతర జరిగేది. కలపాటి వంశస్థులు, అమ్మవారి సేవకులు కలిసి 1714లో జాతర చేసేవారట. కలరా వ్యాధి వచ్చినప్పుడు రాజులు అమ్మవారిని కాంపాళె నుంచి వెంకటగిరికి తీసుకొచ్చారని.. అందుకే నేటికీ ఆ గ్రామంలోని వారికే జాతరలో ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు. కలపాటి కుటుంబం, కాంపాళెంపై వచ్చిన అనేక కథలు కల్పితాలు మాత్రమే అని, వీటికి ఎలాంటి ఆధారాలు లేవని మరికొందరు చెబుతున్నారు.