News April 8, 2025
అన్నమయ్య, కడప జిల్లాలో న్యాయమూర్తుల బదిలీలు

అన్నమయ్య, కడప జిల్లాల్లో జడ్జిలను, అదనపు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వారు ఏప్రిల్ 21 తేదీ లోపు చార్జ్ తీసుకోవాలని వివరించారు. శ్రీలతను ఖాళీగా ఉన్న అన్నమయ్య జిల్లా మదనపల్లి 7 అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. చిత్తూరు పోక్సో కోర్టు జడ్జి ఎన్. శాంతిని కడప ఆరవ అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు.
Similar News
News November 7, 2025
బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్

బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పేరెంట్స్ అయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 7న మగబిడ్డ జన్మించాడని విక్కీ కౌశల్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరికి 2021లో వివాహమైంది.
News November 7, 2025
భారత భూమికి ఉన్న గొప్పతనం ఇదే!

గత 8 ఏళ్లలో 14 దేశాలు తిరిగిన తర్వాత ఇండియాకు ఉన్న గొప్పతనాన్ని గుర్తించానని ఓ ట్రావెలర్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. అమెరికా & యూరప్‌లలో ఎక్కువగా చలి, మధ్యప్రాచ్యంలో దారుణమైన వేడి, ఆగ్నేయాసియాలో అధిక తేమ ఉంటుందని పేర్కొన్నారు. అదే ఇండియాలో వెదర్ హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. ప్రకృతి ఇంతగా అనుకూలించినప్పటికీ అవినీతి, దూరదృష్టి లోపం కారణంగానే భారత్ వెనకబడిందని అభిప్రాయపడ్డారు.
News November 7, 2025
ములుగు: పాఠశాల నిర్మాణం ఆపారు.. మరి చర్యలేవి!

ఏటూరునాగారం మండలం కొమురంభీం గుత్తికోయగూడెంలో అటవీశాఖ అధికారులు పాఠశాల నిర్మాణ పనులను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే పాఠశాల నిర్మాణ పనులు చేపట్టిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు బీట్ అధికారి, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. గుత్తికోయల అభివృద్ధి కోసం కడుతున్న పాఠశాల అడ్డుకొని అటవీశాఖ అబాసుపాలవుతుంది.


