News January 17, 2026
అన్నమయ్య: క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి

చౌడేపల్లి(M) వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన సహదేవ రెడ్డి కుమారుడు తేజ(22) పాలెంపల్లిలో క్రికెట్ టోర్నమెంటుకు వెళ్లాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన సహచార ఆటగాళ్లు అతడిని వెంటనే చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై మరిన్ని తెలియాల్సి ఉంది.
Similar News
News February 12, 2026
1,495 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు

TG: ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 2న ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్స్ నిన్నటితో ముగిశాయి. విధుల్లో అలసత్వం వహించిన 53 ఎగ్జామినర్లను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలకు 3,11,011 జనరల్ కోర్సుల విద్యార్థులు, 90,254 మంది వొకేషనల్ విద్యార్థులు హాజరైనట్లు వివరించారు.
News February 12, 2026
నంద్యాల: ఎదురు చూపులు!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు గడిచినా కొత్త పింఛన్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా వితంతువులతో పాటు వృద్ధాప్య, కళాకారులు, ఇతర పింఛన్లకు అర్హత కలిగిన సుమారు 6 వేలకు మందిపైగా ఉన్నారు. వారంతా నూతన పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నూతన పింఛన్ దరఖాస్తుకు అవకాశం కల్పించాలని అర్హత కలిగిన లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
News February 12, 2026
సంగారెడ్డి: ఛైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో!

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో అత్యంత కీలకమైన ఘట్టం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. 11 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో ఎవరీ అదృష్టం వరిస్తుందో తెలియాలి అంటే 13న కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిందే.


