News January 20, 2026

అన్నమయ్య: ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

image

అన్నమయ్య జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాయల్పాడు సమీపంలోని చింతరాపల్లి వద్ద ఇద్దరు బైకుపై బయల్దేరారు. ఈక్రమంలో తిరుపతి నుంచి మదనపల్లె వైపు వెళ్తున్న కారు కిందకు బైక్ దూసుకెళ్లింది. స్పాట్‌లోనే ఇద్దరు చనిపోయారు. మృతులు ఎవరనేది తెలియాల్సి ఉంది.

Similar News

News February 21, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 21, 2026

వెనక్కి తగ్గేది లేదు: ట్రంప్

image

తాను విధించిన టారిఫ్స్‌ను <<19195677>>రద్దు చేస్తూ<<>> సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ఈ నిర్ణయం తీవ్ర నిరాశపరిచిందని, కొంత మంది న్యాయమూర్తులు విదేశీ ప్రయోజనాలకు ప్రభావితమయ్యారని ఆరోపించారు. కోర్టులోని కొంతమంది సభ్యులను చూసి సిగ్గుపడుతున్నానని ఫైరయ్యారు. వాణిజ్య ఎజెండా నుంచి వెనక్కి తగ్గేది లేదని, ఇంకా బలమైన పద్ధతులు తనకు తెలుసని హెచ్చరించారు.

News February 21, 2026

బాన్సువాడ ఘటన.. పరిస్థితి అదుపులో ఉంది: SP

image

బాన్సువాడ రిలయన్స్ మార్ట్ వివాదంపై ఎస్పీ రాజేశ్ చంద్ర స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. పట్టణంలో శాంతిని కాపాడాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే వ్యక్తులతో పాటు గ్రూప్ అడ్మిన్‌లపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ప్రజలు ఆందోళన చెందవొద్దని కోరారు.