News December 16, 2025

అన్నమయ్య జిల్లాకు జోన్-5 కేటాయింపు

image

APలోని 26 జిల్లాలను జోన్‌‌ల వారీగా విభజించే క్రమంలో అన్నమయ్య జిల్లాను జోన్-5 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-5గా చోటుదక్కింది.

Similar News

News December 17, 2025

పూజలతో బ్రహ్మ రాసిన రాతను మార్చొచ్చా?

image

‘అంతా తలరాత ప్రకారమే జరుగుతుంది అన్నప్పుడు పూజలు ఎందుకు చేయాలి?’ అనే సందేహం కొందరిలో ఉంటుంది. అయితే బ్రహ్మదేవుడు నుదుటిపై రాత రాసేటప్పుడు ‘నేను రాసిన రాతను నేను కూడా తప్పించలేను. కానీ ఉపాసన, ఆరాధన, అర్చనల ద్వారా ఆ విధిని మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే పెడుతున్నాను’ అని కూడా రాశాడట. కాబట్టి, మన అర్చనలు, ఉపాసనలు, కర్మల ద్వారా మన విధిని మనం సవరించుకునే అవకాశం ఉంటుంది.

News December 17, 2025

పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది: కలెక్టర్

image

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, నిబంధనల మేరకు భద్రాద్రి జిల్లాలో నిర్వహించిన మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్య స్ఫూర్తితో విజయవంతంగా పూర్తయ్యాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లా యంత్రాంగం ముందస్తుగా చేపట్టిన విస్తృత ఏర్పాట్లు, భద్రతా చర్యల కారణంగా పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు.

News December 17, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రికార్డు ఉత్పత్తి: పల్లా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకే రోజు 21,012 మెట్రిక్ టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. డిసెంబర్‌లో ప్లాంట్ 92% సామర్థ్యంతో నడుస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రూ.14 వేల కోట్ల నిధులతో ప్లాంట్‌ను ఆదుకుంటోందని, ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. హాట్ మెటల్‌ను పారబోస్తున్నారన్న ప్రచారం అవాస్తవమని తెలిపారు.