News January 26, 2025

అన్నమయ్య జిల్లాకు మొదటి స్థానం

image

సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో అన్నమయ్య జిల్లా విద్యార్థులు మొదటి స్థానం సాధించారని జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి తెలిపారు. ఈనెల 20 నుంచి 25వ తేది వరకు పుదుచ్చేరిలోని ఓల్డ్ పోర్ట్ గ్రౌండ్‌లో సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ పోటీలు జరిగాయి. అన్నమయ్య జిల్లా కలకడ మోడల్ స్కూల్‌ విద్యార్థులు మహమ్మద్ సుహేల్, రెహాన్ మొదటి స్థానం కైవసం చేసుకున్నారు.

Similar News

News November 7, 2025

TODAY TOP STORIES

image

* చొరబాటుదారులను కాపాడే పనుల్లో RJD, కాంగ్రెస్ బిజీ: మోదీ
* బిహార్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్.. 64.66% ఓటింగ్ నమోదు
* డిజిలాకర్‌లో సర్టిఫికెట్లు, హెల్త్ రికార్డులు: CM CBN
* చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్
* BRS ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: CM రేవంత్
* రేవంత్‌కు రోషముంటే KTRను జైల్లో పెట్టాలి: బండి సంజయ్
* T20లో ఆసీస్‌పై భారత్ విక్టరీ.. సిరీస్‌లో 2-1 లీడ్

News November 7, 2025

పొగాకు రైతులకు న్యాయం చేద్దాం: కలెక్టర్

image

ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు, ఫ్యాక్టరీల యాజమాన్యం సమన్వయం చేసుకొని పొగాకు రైతులకు న్యాయం చేద్దామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం రాత్రి బాపట్ల కలెక్టరేట్‌ వద్ద మార్కుఫెడ్ డిఎం, పొగాకు ఫ్యాక్టరీల యాజమాన్యంతో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు, ఫ్యాక్టరీల యాజమాన్యం సమన్వయం చేసుకొని పొగాకు రైతులకు న్యాయం చేద్దామని వివరించారు.

News November 7, 2025

మరో 4 ‘వందేభారత్’లు.. ఎల్లుండి ప్రారంభం

image

దేశంలో మరో 4 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. లక్నో-సహరన్‌పూర్, ఎర్నాకుళం-బెంగళూరు, బనారస్-ఖజురహో, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ఎల్లుండి ఉదయం 8.15 గంటలకు వారణాసిలో ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా ఆగస్టు నాటికి దేశంలో 150 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.