News January 15, 2026

అన్నమయ్య జిల్లాలో కొర్రమీను పెంపకం.. లాభాలమయం..!

image

అన్నమయ్య జిల్లాలో PMDDKY పథకం కింద ఫామ్‌పాండ్‌ల ఆధారంగా (ముర్రెల్)‌ కొర్రమీను పెంపకం విజయవంతంగా సాగుతోంది. కిలోకు రూ.300 – రూ.500 వరకు లభించడంతో లాభాలు వస్తున్నాయి. శాస్త్రీయ పద్ధతులతో ఒక్క సైకిల్‌లో 0.5 నుంచి 1 టన్ను వరకు ఉత్పత్తి వస్తోంది. ఉద్యానవన పంటలతోపాటు చేపల సాగు చేపడితే ఒక్క పంటకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు నికర ఆదాయం లభిస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇండియా పేర్కొంది.

Similar News

News February 5, 2026

ప.గో: ఇన్‌స్టా పరిచయం.. లాడ్జిలో బాలికలపై అత్యాచారయత్నం

image

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఇద్దరు యువకులపై పోక్సో కేసులు నమోదయ్యాయి. యలమంచిలి మండలానికి చెందిన తొమ్మిదో తరగతి బాలికలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పీఎం లంకకు చెందిన యువకులకు పరిచయం అయ్యారు. జనవరి 22న మొగల్తూరులోని లాడ్జికి తీసుకెళ్లి వారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో నరసాపురం CI దుర్గా ప్రసాద్ పర్యవేక్షణలో SI వై. నాగలక్ష్మి విచారణ చేపట్టారు.

News February 5, 2026

చిత్తూరు: స్టాక్ మార్కెట్‌లో భారీగా లాస్.. చీఫ్ ఇంజినీర్ సూసైడ్

image

స్టాక్ మార్కెట్‌లో భారీగా నష్టపోవడంతో చీఫ్ ఇంజినీర్ హర్షవర్ధన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఐరాల(M) బొమ్మసముద్రం గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌ వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో చీఫ్ ఇంజినీర్‌గా పని చేస్తూ గాజువాకలో ఉంటున్నాడు. ఆయన స్టాక్ మార్కెట్‌లో దాదాపు రూ.36 లక్షలు వరకు కోల్పోయారు. ఈ క్రమంలో మనస్తాపం చెంది రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈయనకు భార్య, పాప ఉన్నారు.

News February 5, 2026

KMR: ప్రచార పర్వానికి ఇంకా 5 రోజులే

image

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి 5రోజుల్లో తెరపడనుంది. ఈ నెల 9 సాయంత్రం 5గం.లోపు బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచారాన్ని ముగించాల్సిందే. కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలలో 92 వార్డులకు ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు. దీంతో 92 వార్డుల్లో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ప్రచార పర్వం మరింత జోరుగా ప్రచారానికి అన్ని పార్టీల రాష్ట్ర నాయకుల పర్యటనలు ఖరారు కావాల్సి ఉంది.