News April 23, 2025
అన్నమయ్య జిల్లాలో పదో తరగతి విద్యార్థి సూసైడ్

పదో తరగతి ఫెయిల్ కావడంతో అన్నమయ్య జిల్లాలో ఓ విద్యార్థి బలవనర్మణానికి పాల్పడ్డాడు. గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన విద్యార్థి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. నేడు ఫలితాలు రాగా.. మ్యాథ్స్, సైన్స్‌లో ఫెయిలయ్యాడు. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News April 23, 2025
చంద్రమౌళి మృతదేహానికి సీఎం నివాళి

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జేఎస్ చంద్రమౌళి మృతదేహానికి సీఎం చంద్రబాబు శ్రద్ధాంజలి ఘటించారు. ముందుగా పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యలను ఓదార్చి ధైర్యం చెప్పారు. సీఎంతో పాటు ఎమ్మెల్యే గణబాబు, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవి, పలువురు కూటమి నాయకులు ఉన్నారు.
News April 23, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ జిల్లాలో టెన్త్ టాపర్స్‌ను అభినందించిన కలెక్టర్ ☞ అమరావతిలో ఉగ్ర దాడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ ☞ పిడుగురాళ్లలో సందడి చేసిన హీరోయిన్ మెహరీన్ ☞ సత్తనపల్లిలో పోలీసుల తనిఖీలు ☞ నకరికల్లు పోలీస్ స్టేషను తనిఖీ చేసిన ఎస్పీ ☞ పెద్దకూరపాడులో యువకుడిపై దాడి
News April 23, 2025
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా

ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా ఆయన అవతరించారు. హైదరాబాద్‌తో మ్యాచులో బుమ్రా ఈ ఫీట్ నెలకొల్పారు. 237 ఇన్నింగ్సుల్లో ఆయన ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా జస్ప్రీత్ నిలిచారు. అగ్ర స్థానంలో ఆండ్రూ టై ఉన్నారు. అతడు 208 మ్యాచుల్లోనే 300 వికెట్ల మార్కును అందుకున్నారు.