News February 15, 2025
అన్నమయ్య జిల్లాలో ప్రేమోన్మాది ఎమ్మెల్యే అనుచరుడి కుమారుడే: YCP

అన్నమయ్య జిల్లాలో యువతి గౌతమిపై ప్రమోన్మాది గణేశ్ యాసిడ్ దాడి రాష్ట్రంలో సంచలమైంది. ఈ ఘటనలో యువకుడు టీడీపీ కార్యకర్త అని వైసీపీ ఆరోపించింది. కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళి కుమారుడే గణేశ్ అని ట్వీట్ చేసింది. యువకుడి తండ్రి మురళికి టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయంటూ పలు ఫొటోలను పోస్ట్ చేసింది. మరోవైపు ఈ ఘటనలో గాయపడ్డ యువతికి బెంగళూరులో చికిత్స అందిస్తున్నారు.
Similar News
News July 9, 2025
మంత్రులకు CM చంద్రబాబు వార్నింగ్!

AP: YCP దుష్ప్రచారాలతో పాటు అన్ని విషయాలపై మంత్రులు సకాలంలో స్పందించాలని CM CBN సూచించారు. లేదంటే ఇప్పుడున్న మంత్రుల స్థానంలో కొత్తవారు వస్తారని క్యాబినెట్ భేటీలో హెచ్చరించారు. కాగా మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని 200 కంపెనీలకు YCP ఈ-మెయిళ్లు పెట్టించినట్లు మంత్రి కేశవ్ CM దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన CM.. YCP కుట్రలపై విచారణకు ఆదేశిస్తామన్నారు.
News July 9, 2025
ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు: మంత్రి అనగాని

రైతులకు ఈ ఏడాది ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం తెలిపారు. సర్వే పూర్తయిన భూ యజమానులకు ఈ పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 21.86 లక్షల మందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్, రైతు ఆధార్ వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
News July 9, 2025
నాగార్జునసాగర్ నిండితే వారికి పండుగే..

నాగార్జున సాగర్ ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల ఎమోషన్. ఇది నిండిందంటే చాలు వారికి పండుగే. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం నిండుకుండను తలపిస్తోంది. ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నాగార్జునసాగర్‌లోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు పనులు జోరందుకున్నాయి. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద 3.75 లక్షల ఎకరాలు ఉంది.