News September 15, 2025
అన్నమయ్య జిల్లాలో బాలికపై లైంగిక దాడి

అన్నమయ్య జిల్లాలో సోమవారం అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తంబళ్లపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికపై అదే ఊరికి చెందిన 12ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తంబళ్లపల్లె SI ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Similar News
News September 15, 2025
వరంగల్: ప్రజాపాలన వేడుకలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

జిల్లా కేంద్రంలో ఈనెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన వేడుకలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. అజాం జాహి గ్రౌండ్స్‌లో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్(ఐడీవోసీ)వద్ద నిర్వహించనున్న ఈ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో, జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయి, డీసీపీ అంకిత్ కుమార్, సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు.
News September 15, 2025
HNK: ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో మెగా జాబ్ ఫెయిర్

ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ట్రైనింగ్ & ప్లేస్మెంట్ సెల్.. భౌతికశాస్త్ర విభాగం సహకారంతో మెగాజాబ్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.జ్యోతి తెలిపారు. సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ నైపుణ్యాల ఆధారంగా మంగళవారం నుంచి 3 రోజులపాటు శిక్షణ తరగతులను నిర్వహించిన అనంతరం 19వ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఎల్.జితేందర్ 9849673244ను సంప్రదించాలన్నారు.
News September 15, 2025
ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సమర్పించిన వినతులను వరంగల్ కలెక్టర్ సత్యశారద స్వయంగా స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. నేటి ప్రజావాణి కార్యక్రమానికి 166 ఫిర్యాదులు రాగా, అధికంగా రెవెన్యూ సమస్యలు 72, జీడబ్ల్యూ ఎంసీ 20, గృహ నిర్మాణ శాఖ 11, విద్యా శాఖ 9, డీఆర్డీవో 7, ఇతర శాఖలకు సంబంధించిన 47 ఫిర్యాదులు వచ్చాయి.