News December 15, 2025
అన్నమయ్య జిల్లాలో మరికొందరు సీఐల బదిలీ

అన్నమయ్య జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డి.రామాంజనేయుడును అన్నమయ్య SC, ST సెల్ నుంచి ప్రొద్దుటూరు త్రీటౌన్‌కు బదిలీ చేశారు. టి.మధును అనంతపురం రేంజ్ సర్కిల్ నుంచి DPTC అన్నమయ్యకు, అక్కడ ఉన్న . ఆదినారాయణ రెడ్డిని DCRB, అన్నమయ్యకు బదిలీ చేశారు. ఎం.తులసి రామ్‌ను DCRB నుంచి వీఆర్‌కు పంపారు.
Similar News
News April 13, 2026
ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తాం: అమెరికా

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ పోర్టుల్లోకి వెళ్లే, వచ్చే అన్ని నౌకలను దిగ్బంధిస్తామని US సైన్యం ప్రకటించింది. ‘ఏప్రిల్ 13న 10AM(US టైం ప్రకారం)కు ఇది మొదలవుతుంది. ఇరాన్ పోర్టులు, దాని తీర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే అన్ని దేశాల నౌకలకు వర్తిస్తుంది. ఇరానేతర ఓడరేవులకు వెళ్లే, హార్ముజ్ జలసంధి గుండా వచ్చే ఇతర నౌకలకు ఆటంకం కలిగించబోం’ అని ట్వీట్ చేసింది.
News April 13, 2026
VZM: గొర్రెల కాపరిని తాళ్లతో కట్టిపడేసిన దుండగులు

బొండపల్లి మండలం గొల్లలపేటకు చెందిన పీతల సత్యం(60) ఆదివారం గ్రామానికి సమీపంలోని చింతల చెరువు వద్ద గొర్రెలు కాస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తాటినారతో కాళ్లు,చేతులు,మెడను కట్టి పొదల్లో పడేసినట్లు బాధితుడు వాపోయాడు. అటువైపుగా వెళ్తున్న వ్యక్తులు సాయంత్రం తుప్పల్లో పడి ఉన్న సత్యంను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి గజపతినగరం ఆసుపత్రికి తరలించారు.
News April 13, 2026
ఏలూరు: ఆ విషాద ఘటనకు నాలుగేళ్లు..!

ఏలూరు(D) అక్కిరెడ్డిగూడెం పోరస్ ల్యాబ్స్‌లో 2022 ఏప్రిల్ 13న సంభవించిన రియాక్టర్ పేలుడు తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై APPCB, CPCB విచారణ చేపట్టాయి. భద్రతా ప్రమాణాల ఉల్లంఘనే ఈ ప్రమాదానికి కారణమని విచారణలో తేలింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.


