News February 20, 2026
అన్నమయ్య జిల్లాలో మరో ఘోరం

మదనపల్లె <<19187598>>ఘటన <<>>మరువక ముందే అన్నమయ్య జిల్లాలో మరో ఘోరం జరిగింది. పీలేరులో డిగ్రీ కాలేజ్ సమీపంలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీలో గురువారం సాయంత్రం నాలుగేళ్ల చిన్నారిపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి యత్నించాడు. స్థానికులు కేకలు వేయడంతో పారిపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.
Similar News
News February 20, 2026
వరంగల్: ప్రకృతి సైతం తెలంగాణ కోసం..!

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రకృతి సైతం తన వంతు సహకారాన్ని అందించింది. ఉద్యమంలో భాగంగా పలువురు కవులు, రచయితలు ప్రకృతితో మమేకమవుతూ ప్రకృతిని జోడిస్తూ తెలంగాణ కోసం అనేక గేయాలను, రచనలను రచించారు. దానిలో భాగంగా తొర్రూరు మండలానికి చెందిన గిద్దె రాంనర్సయ్య ‘కొమ్మలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది.. జై తెలంగాణ అన్నది’ అంటూ ప్రకృతిని, అందులోని వన్యప్రాణులను సైతం మిళితం చేసి పాటలను రచించారు.
News February 20, 2026
WGL: తెలంగాణ కోసం వానమ్మను పిలిచాడు!

తన కవితలతో మానవతా విలువలను ప్రతిబింబించిన సాహిత్య సమరయోథుడు జయరాజు. సామాజిక సమస్యలు, గ్రామీణ జీవితం, మానవ సంబంధాలు ఆయన రచనలకు ప్రేరణగా నిలిచాయి. ‘ఒక్కసారైన వచ్చిపోవే.. వానమ్మ’ అంటూ తెలంగాణ కరవు కాటకాలపై జయరాజు రాసిన పాట ఎందరో గుండెలను తాకింది. ఉద్యమ సమయంలో ఆయన రచనలు చైతన్య భరిత స్వరంగా నిలిచాయి. తెలుగు సాహిత్యంలో ప్రేరణాత్మక వ్యక్తిత్వం కలిగిన జయరాజు ఉమ్మడి WGLకు చెందిన వ్యక్తి కావడం గర్వకారణం.
News February 20, 2026
GREAT: ఓటమి నుంచి ప్రపంచ రికార్డుల వరకు!

మిస్టర్ బీస్ట్ తన యూట్యూబ్ ప్రస్థానాన్ని ప్రారంభించి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన యువతలో స్ఫూర్తి నింపే పోస్ట్ చేశారు. మొదట్లో ఎవరూ తన వీడియోలు చూడలేదని, అందరూ తనను హేళన చేస్తూ సమయం వృథా అని విమర్శించారని గుర్తుచేసుకున్నారు. అయినప్పటికీ పట్టుదలతో శ్రమించి 468M సబ్‌స్క్రైబర్లతో Mr Beast ప్రపంచంలోనే టాప్ యూట్యూబర్‌గా ఎదిగారు. ఇప్పటివరకు ఆ ఛానల్‌కు 11వేల కోట్ల వ్యూస్ రావడం విశేషం.


