News February 17, 2026
అన్నమయ్య జిల్లాలో మరో దారుణ హత్య

అన్నమయ్య జిల్లాలోని గాలివీడులో స్టోర్ డీలర్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. మండలంలోని ఒడిసిలెంకవారిపల్లె రేషన్ షాప్ డీలర్ టి. కృష్ణారెడ్డిని కత్తులతో అతి కిరాతకంగా నరికి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి డీఎస్పీ చేరుకొని విచారిస్తున్నారు. అలాగే మదనపల్లెలో బాలికను ఓ వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 18, 2026
జనగామ: కలెక్టరేట్‌లో నేడు శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభం

జనగామ కలెక్టరేట్‌లోని మహిళా ఉద్యోగుల చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిశు సంరక్షణ కేంద్రాన్ని బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించనున్నారు. ఐడీఓసీ భవనంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం పక్కన ఈ కేంద్రాన్ని సర్వసౌకర్యాలతో సిద్ధం చేశారు. కలెక్టర్ చొరవతో ఏర్పాటైన ఈ కేంద్రం వల్ల విధుల్లో ఉండే మహిళా ఉద్యోగులకు తమ పిల్లల సంరక్షణ విషయంలో పెద్ద ఊరట లభించనుంది.
News February 18, 2026
మెదక్ కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

TG: న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారని ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. అనంతరం తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలిపేసింది. అప్పీల్ చేసుకునేందుకు కలెక్టర్‌కు గడువిచ్చింది.
News February 18, 2026
మాజీ మంత్రి ముద్రగడతో గుడివాడ అమర్నాద్ భేటీ

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కలిశారు. మంగళవారం కిర్లంపూడిలోని వారి నివాసంలో ముద్రగడతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు అంబటి రాంబాబు అరెస్టుపై ఇరవురు చర్చించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, భీమిలి వైసీపీ ఇన్‌ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు, బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు.


