News April 15, 2025

అన్నమయ్య జిల్లాలో ముగ్గురి మృతి

image

అన్నమయ్య జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. కలకడ మండలం దాసిరెడ్డిగారి పల్లెలో ఆదిలక్ష్మి ఆనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ములకల చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నప్ప చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కురుబలకోటలో కరెంట్ షాక్‌తో రమేశ్ మృతి చెందారు.

Similar News

News July 7, 2025

నూజివీడు IIITలో 141 సీట్లు ఖాళీ

image

నూజివీడు IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల భర్తీ పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 869 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 141 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.

News July 7, 2025

KU పరిధిలో 2,356 ఇంజినీరింగ్ సీట్లు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 2,356 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలోని రెండు కాలేజీల్లో 780 సీట్లు ఉండగా.. నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో 1,576 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,103 సీట్లను భర్తీ చేయనున్నారు. టీజీఎప్‌సెట్-2025 ఫస్ట్ ఫేజ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈ నెల 8 వరకు అవకాశం ఉండగా.. వెబ్ ఆప్షన్లకు 10 వరకు గడువు ఉంది.

News July 7, 2025

దండేపల్లి: అత్తారింటి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

image

అత్తారింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి మండలం గుడిరేవులో జరిగింది. ఎస్ఐ తహిసోద్దీన్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రూపను భర్త, అత్తమామలు, సమీప బంధువులు వేధింపులకు గురి చేయడంతో ఆమె ఈనెల 5న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రూప తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.