News January 11, 2026
అన్నమయ్య జిల్లాలో రేపు అర్జీల స్వీకరణ

అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) ద్వారా సోమవారం ప్రజల నుంచి అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్‌లో నమోదు చేసుకోవచ్చని డీపీఆర్‌ఓ తెలిపారు. అవసరం అయితే మీకోసం కాల్ సెంటర్ 1100ను సంప్రదించగలరన్నారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్, జేసీ, డీఆర్‌ఓలు సమస్యలను స్వీకరిస్తారని అన్నారు.
Similar News
News January 30, 2026
భూమిని కాపాడేందుకు వరాహ రూపమే ఎందుకు? (1/2)

గ్రహాలన్నీ ఓ నియమ కక్ష్యలో తిరుగుతుంటాయి. అయితే హిరణ్యాక్షుడు భూకక్ష్యకు విఘాతం కలిగించడంతో అది విశ్వ గర్భోదక జలాల్లో మునిగిపోయింది. నీటి అడుగున ఉన్న భూమిని రక్షించి, తిరిగి అదే స్థానంలో నిలపడానికి జలచర సామర్థ్యం గల వరాహ రూపం అనువైనది. అందుకే విష్ణువు ఆ అవతారమెత్తాడు. తన కొమ్ముదంతంతో భూమిని ఉద్ధరించి, హిరణ్యాక్షుణ్ని సంహరించాడు. ఇది కేవలం లీల మాత్రమే కాదు. సృష్టి సమతుల్యతను కాపాడే దివ్య చర్య.
News January 30, 2026
మామునూరు విమానాశ్రయం.. కేంద్రానికి 300 ఎకరాలు అప్పగింత

TG: WGL మామునూరు విమానాశ్రయం కోసం సేకరించిన 300 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. బేగంపేట్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి Dy.CM భట్టి విక్రమార్క డాక్యుమెంట్లను అందజేశారు. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని రామ్మోహన్ స్పష్టం చేశారు. పనులు ప్రారంభమైన నాటి నుంచి 2.5ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
News January 30, 2026
వరాహ స్వామి, వారాహి దేవి.. ఇద్దరూ ఒకరేనా?

ఇద్దరూ ఒకరు కాదు. కానీ ఒకే తత్వానికి చెందినవారు. వరాహ స్వామి దశావతార రూపం. వారాహి దేవి మాత్రం వరాహమూర్తి నుంచి ఉద్భవించిన ఆయన అంశ. సప్తమాతృకలలో ఒకరైన వారాహి దేవి, వరాహ స్వామి ముఖాన్ని పోలి ఉండి, రాక్షస సంహారంలో శక్తిగా తోడ్పడింది. వరాహ స్వామి రక్షకుడు అయితే, వారాహి దేవి ఆ స్వామి కార్యనిర్వాహక శక్తి. అయితే వరాహ అవతారానికి పూర్వమే, వారాహి దేవి ఉనికి ఉందని ఇంకొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.


