News December 15, 2025
అన్నమయ్య జిల్లాలో సీఐల బదిలీ

అన్నమయ్య జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.రోషన్‌ను రామాపురం నుంచి రాయచోటి రూరల్‌కు బదిలీ చేశారు. అక్కడ ఉన్న వరవరప్రసాద్‌ను వీఆర్‌కు పంపారు. సీసీఎస్‌లో పనిచేస్తున్న కృష్ణంరాజు నాయక్‌ను లక్కిరెడ్డిపల్లి సీఐగా నియమించారు. అక్కడ ఉన్న కొండారెడ్డిని RSASTFకు, RSASTF నుంచి చంద్రశేఖర్‌ను ఆదోనికి, మస్తాన్‌ను SC, ST సెల్‌కు బదిలీ చేశారు.
Similar News
News December 19, 2025
తణుకు: లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

తణుకు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. పాత టోల్ గేట్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో లారీ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సు అమలాపురం నుంచి విజయవాడ వెళుతున్నట్లు సమాచారం.
News December 19, 2025
HYDలో తగ్గిన ఎయిర్ క్వాలిటీ.. జాగ్రత్త!

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరుకుంటోంది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్‌లోకి చేరుకుంది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT
News December 19, 2025
కామారెడ్డి: 17 ప్రదేశాల్లో ఆరెంజ్ అలర్ట్.. ఉష్ణోగ్రతల తగ్గుదల

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు తగ్గి ఆరెంజ్ అలర్ట్ లో ఉందని అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. మేనూర్ 8.4°C, డోంగ్లి 8.6, రామలక్ష్మణపల్లి 8.9, సర్వాపూర్, దోమకొండ, గాంధారి, లచ్చపేట 9.2, బీర్కూర్ 9.4, నస్రుల్లాబాద్ , బొమ్మన్ దేవిపల్లి, పెద్దకొడప్గల్, ఎల్పుగొండ 9.5, జుక్కల్ 9.6, నాగిరెడ్డిపేట 9.7, పుల్కల్, బిచ్కుంద 9.8°C లుగా నమోదయ్యాయి.


