News December 22, 2025
అన్నమయ్య జిల్లాలో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

అన్నమయ్య జిల్లా కేవీ పల్లి (M) కరణంవారి పల్లికి చెందిన రాచపల్లి నాగచైతన్య (15) మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. చౌడేపల్లి జడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతూ ఎస్సీ హాస్టల్‌లో ఉంటున్న అతడు శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. చదువుపై తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై రాత్రి ఇంటి వరండాలో ఉరి వేసుకున్నట్లు సమాచారం. గమనించి వెంటనే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు.
Similar News
News December 23, 2025
Money Tip: కోటి రూపాయలు ఉన్నాయా? ఈ చేదు నిజం తెలుసుకోండి!

ద్రవ్యోల్బణం వల్ల డబ్బు కొనుగోలు శక్తి ఏటేటా తగ్గుతూ ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం సగటున 5% ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేస్తే నేటి ₹కోటి విలువ పదేళ్ల తర్వాత దాదాపు ₹61.37 లక్షలకు పడిపోతుంది. ఈరోజు ₹కోటితో కొనే వస్తువులు లేదా ఆస్తులను పదేళ్ల తర్వాత కొనాలంటే సుమారు ₹1.62 కోట్లు అవసరమవుతాయి. అందుకే కేవలం పొదుపుపైనే కాకుండా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడినిచ్చే పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.
News December 23, 2025
‘ఈ ఏడు కాకుంటే.. వచ్చే ఏడాదైనా మారుతుంది’

ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా, శరీరాన్ని తాకట్టుపెట్టి, సాగులోనే మనసును బందీ చేసి, ఆత్మని పొలంలోనే పాతిపెడతాడు అన్నదాత. చర్మం మండేలా కాసే ఎండలోనైనా, ఎముకల కొరికే చలినైనా, కుండపోత వర్షమైనా దేనినీ లెక్క చేయకుండా సేద్యం చేస్తూ, తన పంటను కాపాడుకొనేందుకు పగలు, రాత్రి కష్టపడతాడు. ప్రకృతి ప్రకోపంతో పంట కోల్పోయినా.. ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాదైనా పరిస్థితి మారుతుందనే ఆశతో జీవించే ఏకైక వ్యక్తి ‘రైతు’.
News December 23, 2025
KMR: నమస్తే సర్పంచ్ సాబ్! ఇక పల్లెల్లో అభివృద్ధి పరుగులే

కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీల్లో రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. తాజాగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధికి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. నేటి నుండి పూర్తిస్థాయి పాలన ప్రారంభం కావడంతో, ఆగిపోయిన అభివృద్ధి పనులు ఇకపై ఊపందుకోనున్నాయి.


