News December 23, 2025
అన్నమయ్య జిల్లాలో 19 మంది ఎస్సైల బదిలీ

అన్నమయ్య జిల్లాలో 19 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజంపేట UG Ps నుంచి వేంకటేశ్వర్లను మదనపల్లె వన్ టౌన్ UG Ps- 2 కు బదిలీ చేశారు. అన్నమయ్య హెడ్ క్వార్టర్ నుంచి పి. శ్రావణిని పెద్దముడియంకు, జి. శోభను LR పల్లెకు, డి. రవీంద్రబాబును LR పల్లె నుంచి పెద్దముడియంకు, సీ. ఉమామహేశ్వర్ రెడ్డిని తంబళ్లపల్లె నుంచి DCRBకి బదిలీ చేశారు.
Similar News
News December 24, 2025
మెదక్: చర్చిల ఫీస్ట్ వేడుకలకు నిధులు మంజూరు

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని చర్చిల్లో ఫీస్ట్ సెలబ్రేషన్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.34 లక్షలు మంజూరు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షలు కేటాయించగా, రెండు నియోజకవర్గాల్లోని 100 చర్చిలకు ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున రూ.30 లక్షలు మంజూరు చేసిందన్నారు.
News December 24, 2025
చట్టాల గురించి తెలుసుకోండి: చిత్తూరు ఎస్పీ

చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఎస్సీటీ పీసీలకు జరుగుతున్న శిక్షణను ఎస్పీ తుషార్ డూడీ బుధవారం పరిశీలించారు. వారి శిక్షణ అభిప్రాయాలను తెలుసుకున్నారు. సిలబస్ అమలుపై అధికారులకు సూచనలు ఇచ్చారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
News December 24, 2025
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చిన్నారులకు వైద్య పరీక్షలు

ప్రకాశం జిల్లాలో చిన్నారుల ఆరోగ్యానికి మరోసారి ఇచ్చేందుకు చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు బుధవారం సైతం జిల్లా వ్యాప్తంగా DMHO డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశాలతో ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. 0 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులు 404091 మంది ఉండగా, బాల్యంలో వ్యాధులు ఉన్నవారిగా 314 మందిగా అధికారులు గుర్తించారు.


