News September 13, 2025
అన్నమయ్య జిల్లాలో 3 బార్లకు దరఖాస్తుల గడువు పొడిగింపు

అన్నమయ్య జిల్లాలో 3 బార్లకు దరఖాస్తుల గడువు పొడిగించారు. రాయచోటి 1, మదనపల్లె 1, పీలేరు 1 చొప్పున బార్లకు ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని శుక్రవారం జిల్లా ఎక్సైజ్ అధికారి మధుసూదన్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నిర్దేశిత సమయానికి ముందుగా అబ్కారీ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. లాటరీ పద్ధతిలో కేటాయింపు 18వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ PGRS హాల్లో నిర్వహిస్తామని తెలిపారు.
Similar News
News April 5, 2026
నక్కపల్లిలో యాక్సిడెంట్.. VZM వాసి దుర్మరణం

అనకాపల్లి (D) నక్కపల్లి(M) వెదుళ్లపాలెం హైవేపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. VZM(D) గంట్యాడ(M) గింజేరుకు చెందిన పదిమంది గురువారం ఒంగోలులో ఫంక్షన్లకు వెళ్లి వ్యాన్‌లో తిరిగి వస్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆర్.రామ్మూర్తి మృతి చెందాడు. శాంతి, దేవి, దుర్గమ్మ, రామలక్ష్మి, లక్ష్మి గాయపడినట్లు ఎస్సై సన్నిబాబు తెలిపారు.
News April 5, 2026
పాలమూరు: ప్రేమించి పెళ్లి.. వేధించి ప్రాణం తీశాడు!

ప్రేమ వివాహం చేసుకున్న భార్యనే భర్త కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు.. MBNR జిల్లా మూసాపేట (M) పోల్కంపల్లికి చెందిన చందు 8 నెలల క్రితం శ్రీదేవి(19)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ తీవ్రంగా జరగడంతో ఆమెను కొట్టి హత్య చేశాడు. చందు వరికోత మిషన్ డ్రైవర్‌గా, ఆమె నర్సుగా పని చేస్తున్నారు. మూసాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News April 5, 2026
న్యూక్లియర్ ముప్పు.. ఐరాసకు ఇరాన్ లెటర్

ఇరాన్‌లోని ఏకైక అణు విద్యుత్ కేంద్రం ‘బుషెహర్’ సమీపంలో జరుగుతున్న వరుస దాడులపై ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఐరాసకు లేఖ రాశారు. ఈ అటాక్స్ వల్ల రేడియోధార్మికత వెలువడే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల కేవలం ఇరాన్‌కే కాకుండా పొరుగు దేశాలకూ తీరని నష్టం కలుగుతుందని హెచ్చరించారు. దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని కోరారు. తాజాగా ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఈ కేంద్రంపై నాలుగోసారి దాడి చేశాయి.


