News January 13, 2026

అన్నమయ్య జిల్లాలో DSC ఉద్యోగాలు ఇలా..!

image

రాబోయే DSC నోటిఫికేషన్‌లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70-30%తో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. 560కి పైగా పోస్టులు ఉండగా.. 30% నోటిఫికేషన్ 70% పోస్టులను పదోన్నతులతో నింపనున్నారు. ఖాళీల జాబితాను అధికారులు సిద్ధంచేస్తున్నట్టు చెప్పారు. ఈ నెలాఖరుకల్లా పూర్తి పోస్టుల జాబితా వస్తుందన్నారు. నూతన DSC ప్రకటన ఫిబ్రవరిలో వెలువడనుండగా జూన్ చివరికి నియామక ప్రక్రియ పూర్తవనుంది.

Similar News

News February 5, 2026

తిరుపతి: మిషన్ స్వర్ణ సర్వే పూర్తి..!

image

స్వర్ణముఖి నదీ పరిరక్షణ కోసం తుడా ఛైర్మన్ దివాకర్‌రెడ్డి చేపట్టిన మిషన్ స్వర్ణ (ఆపరేషన్ స్వర్ణ) కార్యక్రమం సర్వే పూర్తయింది. నదీ పరివాహక ప్రాంతం ఆక్రమణలు చంద్రగిరి, తిరుపతి రూరల్, రేణిగుంటలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తుడా బోర్డు సమావేశంలో సరిహద్దులు గుర్తించి రాళ్లు పాతడానికి తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అనుమతులు రాగానే పనులు ప్రారంభం కానున్నాయి.

News February 5, 2026

మల్లె సాగు – అనువైన రకాలు

image

మల్లె సాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. తేలికపాటి నేలలు, ఒండ్రునేలలు, ఇసుక నేలల్లో దిగుబడి బాగుంటుంది. గుండు మల్లె, జాజిమల్లె, కాగడా మల్లె రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. గుండు మల్లెల్లో అర్క ఆరాధన, కో-2, కస్తూరి రకాలు.. జాజిమల్లెల్లో అర్క సురభి, కో-1, కో-2 రకాలు మంచి దిగుబడినిస్తాయి. పూల కోసం, నూనె తయారీకి జాజిమల్లెలు అనుకూలం. కాగడ మల్లెలు నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకుంటాయి.

News February 5, 2026

కానుగ నీడ, కన్నతల్లి నీడ

image

ప్రకృతిలో లభించే నీడలలో కానుగ చెట్టు నీడ అత్యంత చల్లనిదిగా పరిగణించబడుతుంది. ఇతర చెట్ల కంటే దీని ఆకులు దట్టంగా ఉండి, ఎండను అసలు చొరబడనీయకుండా ఉంటాయి. అందుకే ఈ చెట్టు కింద సేద తీరితే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక బిడ్డకు తన కన్నతల్లి ఒడి ఎంతటి భద్రతను, చల్లదనాన్ని, ఓదార్పును ఇస్తుందో.. ఎండలో అలసిపోయిన బాటసారికి కానుగ చెట్టు నీడ అంతటి ఉపశమనాన్ని ఇస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.