News October 7, 2025
అన్నమయ్య జిల్లాలో SIల బదిలీ

అన్నమయ్య జిల్లాలో పలువురు SIలను బదిలీ చేస్తూ SP ధీరజ్ కునుబిల్లి ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌లో ఉన్న డి.రమేశ్ బాబును రామసముద్రానికి, ఎస్.రహీమ్‌ను పీలేరు రెండో ఎస్ఐగా నియమించారు. సంబేపల్లి నూతన ఎస్ఐగా కె.రవికుమార్, వాయల్పాడు రెండో ఎస్ఐగా PV రమణయ్య బదిలీ అయ్యారు. మదనపల్లె 2టౌన్ రెండో ఎస్ఐగా బి.రామాంజనేయులు నియమితులయ్యారు. వీఆర్‌లో ఉన్న మరికొందరు ఎస్ఐలకు జిల్లా కేంద్రంలోనే పోస్టింగ్ ఇచ్చారు.
Similar News
News October 7, 2025
ఘనంగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు.. PHOTOS

AP: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తన కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సిరిమానోత్సవం నిర్వహించనున్నారు.
News October 7, 2025
వనపర్తి: ‘ఉత్తమ ఉర్దూ టీచర్’ అవార్డులకు దరఖాస్తులు

ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డు-2025 లకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అఫ్జలుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు మైనారిటీ సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు ఫారం తీసుకొని, సంబంధిత ధ్రువపత్రాలతో కలిపి ఈ నెల 14వ తేదీలోగా జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని ఆయన కోరారు. ఇతర వివరాల కోసం 08545232500 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.
News October 7, 2025
10 వీక్లీ స్పెషల్ ట్రైన్ల టర్మీనల్ మార్పు

తిరుపతి రైల్వే స్టేషన్ వరకు నడిచే పది ట్రైన్స్ టెర్మినల్స్‌ను దక్షిణ మధ్య రైల్వే మార్పు చేసింది. వీక్లీ స్పెషల్ కింద నడిచే పది ట్రైన్స్ తిరుచానూరు స్టేషన్ వరకు నడవనున్నాయి. 07609, 07610, 07251, 07252, 07015, 07016, 07009, 07010, 07017, 07018 ట్రైన్స్ ఇకపై తిరుచానూరు స్టేషన్ నుంచి నడవనున్నాయి.