News December 10, 2025

అన్నమయ్య: జిల్లాల విభజన.. తెరమీదికి మరో డిమాండ్.!

image

రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రైల్వే కోడూరు మండలం ఎంపీటీసీలు కోరారు. రైల్వే కోడూరు మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం సమర్పించారు. వైసీపీ ప్రభుత్వం అన్నమయ్య జిల్లాకు మధ్యలో ఉందని రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించారని మదనపల్లిని విభజించిన తర్వాత రాజంపేట అన్నమయ్య మధ్యలో ఉందన్నారు. రాజంపేట వీలు కాకుంటే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని కోరారు.

Similar News

News December 12, 2025

MBNR జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

MBNR జిల్లాలో 139 గ్రామ పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 83.04 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

News December 12, 2025

ములుగు జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

జిల్లాలో 48 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 78.65 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

News December 12, 2025

కామారెడ్డి జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

కామారెడ్డి జిల్లాలో మొదటి విడత జీపీ ఎన్నికలు గురువారంతో ప్రశాంత వాతావరణంలో ముగిశాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 79.40 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ వెల్లడించారు. 10 మండలాల్లోని సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన పోలింగ్‌ను కలెక్టర్, ఐడీసీలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా, అలాగే పలు పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించి పర్యవేక్షించారు.