News December 16, 2025

అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా సుగవాసి?

image

టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబును నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు తనయుడు ఈయన. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. సుదీర్ఘకాలం నుంచి పార్టీలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఈ పదవి లభించింది. ఈయన అన్న సుగవాసి బాలసుబ్రమణ్యం రాజంపేటలో ఓటమి చెందాక.. ఇటీవల వైసీపీలో చేరారు.

Similar News

News December 17, 2025

డిసెంబర్ 17: చరిత్రలో ఈరోజు

image

* 1903: రైట్ సోదరులు తయారు చేసిన విమానం మొదటిసారి ఎగిరింది
* 1914: క్రికెట్ లెజెండ్ సయ్యద్ ముస్తాక్ అలీ జననం
* 1959: నటి జయసుధ జననం
* 1959: ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణం
* 1985: నటుడు అడివి శేష్ జననం
* 1996: సినీ నటి సూర్యకాంతం మరణం(ఫొటోలో)

News December 17, 2025

SRCL: లక్ష్మీనరసింహస్వామికి అగ్గిపెట్టెలో ఇమిడే చీర అందజేత

image

సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతం సృష్టించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేకించి అగ్గిపెట్టెలో ఇమిడే రెండు గ్రాముల బంగారు చీరను మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో వెంకటస్వామికి అందించారు. దీని పొడవు 5:30 మీటర్లు వెడల్పు 48 ఇంచులు దీనిని తయారు చేయుటకు వారం రోజుల వ్యవధి పట్టిందన్నారు. ఈ సందర్భంగా నల్ల విజయ్‌కు అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.

News December 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.