News February 8, 2025
అన్నమయ్య జిల్లా కంది రైతులకు అలర్ట్

ఈనెల 10 నుంచి జిల్లాలో కందులు అమ్మే రైతులందరూ రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలని జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ శుక్రవారం తెలిపారు. కందులు సాగు చేసే రైతులు నష్టపోకుండా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఒక క్వింట మద్దతు ధర రూ.7550 ప్రకటించడమైనదన్నారు. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ కమిటీ అధికారి త్యాగరాజు, వ్యవసాయ అధికారి చంద్రలతో తీసుకోవాల్సిన చర్యలపై జేసీ సమీక్షించారు.
Similar News
News December 22, 2025
విశాఖ: కేజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి

కేజీహెచ్‌లో వైద్యం కోసం వెళ్లిన రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ స్వర్ణలత మృతి చెందింది. దీనిపై మృతురాలి బంధువులు కేజీహెచ్ సూపరింటెండెంట్, టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఆమె ఓపీ కోసం వెళ్లగా.. వెంటిలేటర్‌పై ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. అయితే తరలించడంలోనూ నిర్లక్ష్యం వహించడం వలనే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
News December 22, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,100 పెరిగి రూ.1,35,280కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,000 ఎగబాకి రూ.1,24,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,31,000కు చేరింది. వెండి ధర 3 రోజుల్లోనే రూ.10వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 22, 2025
ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!

MGNREGA స్థానంలో కేంద్రం కొత్తగా తెచ్చిన VB-G RAM G చట్టంతో రైతులకు ఊరట దక్కనుంది. ఈ చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో పీక్ అగ్రికల్చర్ సీజన్ (పంటలు వేసే, కోసే)లో 60 రోజుల పాటు ఉపాధి పనులు నిలిపివేసే వెసులుబాటు ఉంది. దీనివల్ల రైతులకు కూలీల కొరత నుంచి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు ఉపాధి హామీ పని దినాలు 100 నుంచి 125 రోజులకు పెరగడంతో కూలీల ఆదాయం 25% పెరగనుంది.


