News July 7, 2025
అన్నమయ్య జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన

తోతాపురి మామిడి రైతులకు మన ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర ఇతర రాష్ట్రాలకే ఆదర్శమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 5వ తేదీ నుంచే రైతులకు అదనంగా రూ.4(కేజీకి) చెల్లిస్తున్నట్లు చెప్పారు. ధరలను పర్యవేక్షించడానికి ఉద్యాన, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులను బృందాలుగా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రైతు నుంచి చివరి వరకు మామిడి కొనుగోలు చేస్తామన్నారు.
Similar News
News July 7, 2025
‘కాంతార చాప్టర్-1’ రిలీజ్ డేట్ వచ్చేసింది

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘కాంతార చాప్టర్-1’ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 2022లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. హోంబలే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
News July 7, 2025
వరంగల్: వారికి పెన్షన్లు ఎప్పుడు వచ్చెనో..?

ఉమ్మడి జిల్లాలో పలువురు దివ్యాంగులకు ఏళ్ల తరబడి పెన్షన్లు అందడం లేదు. గతంలో జిల్లా స్థాయి మెడికల్ బోర్డులో తిరస్కరించగా.. దానిపై రాష్ట్ర మెడికల్ బోర్డుకు కొందరు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 375, జనగామలో 90 అప్పీళ్లు ఉన్నాయి. HNK, BHPL, WGL, ములుగులోను వంద లోపు అప్పీళ్లు వచ్చాయి. వాటిని పరిష్కరించి, పథకాలకు అర్హులుగా అయ్యేలా చూడాలని దివ్యాంగులు కోరుతున్నారు.
News July 7, 2025
MBNR: ఆ ప్రాంతాల్లో 15 చిరుతల సంచారం.. ప్రజలు అప్రమత్తం

మహబూబ్ నగర్, మహమ్మదాబాద్ మండలాలోని అటవీ ప్రాంతాల్లో సుమారు 15 చిరుతల మేర సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. గాధిర్యాల్ లోని కొణెంగల గుట్టపై చిరుత సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో ఫారెస్ట్ అధికారులు లావణ్య, శ్రీనివాస్, సిబ్బంది కొణెంగల గుట్టకు వెళ్లి పరిశీలించారు. కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేంజ్ అధికారి అబ్దుల్ హై పేర్కొన్నారు.