News September 12, 2025
అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్‌గా నిశాంత్ కుమార్

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్‌గా నిశాంత్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత కలెక్టర్ చామకూరి శ్రీధర్‌ను బదిలీ చేశారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ ఏపీ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా శ్రీధర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాను అభివృద్ధి పథంలో నడపడానికి తన వంతు కృషి చేశారు. అయితే ఈయనను ఎక్కడికి బదిలీ చేశారో తెలియాల్సి ఉంది.
Similar News
News September 12, 2025
విజయనగరం కలెక్టర్‌కు సన్మానం

విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్‌ను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. జిల్లా నుంచి బదిలీ అయిన నేపథ్యంలో రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్‌ను తన ఛాంబర్లో కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
News September 12, 2025
నల్గొండ: 15న ప్రజావాణి రద్దు

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నందున ఈ సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
News September 12, 2025
HYD- గోవాకు ఎగిరిపోదాం పదా బ్రో

పర్యాటక ప్రేమికుల కోసం IRCTC కొత్త ఎయిర్ ప్యాకేజీలు ప్రకటించింది. HYD నుంచి వివిధ ప్రాంతాలకు విమానాల్లో ప్రయాణికులను తీసుకెళ్లనుంది. 4, 5, 6, 8 రోజుల ప్యాకేజీలు తీసుకొచ్చింది. గోవా, గుజరాత్, కశ్మీర్, మేఘాలయ, కర్ణాకట, అండమాన్, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రాంతాలను చూపించనుంది. వీటితోపాటు థాయిలాండ్, శ్రీలంక దేశాలు కూడా ఉన్నాయి. వివరాలకు 040-27702407, 9701360701 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.