News December 15, 2025
అన్నమయ్య జిల్లా ప్రజలకు గమనిక

అన్నమయ్య జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీదారులు కలెక్టరేట్‌కు రాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరిష్కారం కాని అర్జీలను మాత్రమే జిల్లా కేంద్రంలో స్వీకరిస్తామని ఆయన వివరించారు.
Similar News
News April 5, 2026
వరంగల్: ఎస్సై గారూ.. ఓ లుక్కేయండి..!

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ఆర్ఎంపీల పేరిట కొందరు తాయత్తులు, మంత్ర తంత్రాలతో ప్రజలను మభ్యపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దయ్యం, దోషం పేరుతో భయపెట్టి మొదట రూ.500 నుంచి ప్రారంభించి దశలవారీగా రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఇలాంటి మోసాలపై పోలీసులు వెంటనే స్పందించాలని, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News April 5, 2026
IPL హీట్: టాలీవుడ్ కలెక్షన్లకు గండి!

IPL మ్యాచ్‌లు ఉండటంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఆడియెన్స్ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘రాకాస’, ‘బైకర్’ వంటి సినిమాలకు మ్యాచ్‌ల సెగ తగులుతోంది. ఏప్రిల్ 10న రాబోతున్న ‘డెకాయిట్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రాలకు కూడా ఇదే టెన్షన్ పట్టుకుంది. మే నెలాఖరు వరకు IPL సందడి కొనసాగనుంది. కంటెంట్ బాగుంటే తప్ప ఈ ‘క్రికెట్ తుఫాను’ను తట్టుకోవడం కష్టమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
News April 5, 2026
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు కేజీ రూ.230-రూ.300 మధ్య ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రాంతాలను బట్టి రూ.260 నుంచి రూ.290, వరంగల్‌లో రూ.280, కామారెడ్డి జిల్లాలో రూ.280-రూ.290 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.230, గుంటూరులో రూ.250, విశాఖలో రూ.270, బాపట్లలో రూ.300కు అమ్ముతున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


