News December 30, 2024

అన్నమయ్య జిల్లా: ప్రమాదంలో భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

image

మదనపల్లె బైపాస్‌లోని రాయల్ ఉడ్ వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు టైర్ పంచర్ కావడంతో బైకు, బంకు, చెట్టును ఢీకొట్టింది. గాయాలపాలైన దంపతుల్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మృతుడు పలమనేరు దాసర్లపల్లికి చెందిన గంగాధర్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News

News January 2, 2025

కడప పట్టణాన్ని నిర్మించిన రాజు మీకు తెలుసా?

image

దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైన పట్టణాలలో కడప పట్టణం ఒకటి. పెన్నా నది ఒడ్డున మొదటి కడప పట్టణాన్ని తమిళ రాజు కరికాల చోళుడు నిర్మించినట్లు తమిళ సంఘ సాహిత్యంలోని తల్కాపియం అనే గ్రంథం ఆధారంగా తెలుస్తుంది. కరికాల చోళుని పేరు మీదనే కడప అనే పేరు వచ్చింది. అప్పటి జిల్లా ప్రధాన పరిపాలనా కేంద్రం సిద్ధపటం కోట. ఈ కోట కూడా పెన్నా నది ఒడ్డునే ఉండడం విశేషం. కంచి ఏకాంబరేశ్వరబాబు ఆలయంలో వీరి విగ్రహం ఉంది.

News January 2, 2025

కడప జిల్లాలో రూ.14 కోట్ల మద్యం తాగేశారు

image

నూతన సంవత్సరానికి మందు బాబులు ఫుల్ కిక్‌తో స్వాగతం పలికారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కడప జిల్లాలో డిసెంబర్ 30, 31 జనవరి 1న రూ.14,51,06,769 మద్యాన్ని మందు బాబులు తాగేశారు. వీటిలో లిక్కర్ 18,586 కేసులు, బీర్లు 8586 కేసులు అమ్మకాలు జరిగాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు.

News January 2, 2025

కడప: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌కు ఘన స్వాగతం

image

కడప జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించేందుకు వచ్చిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయంలో కడప ఆర్డీవో జాన్ ఏర్విన్ కేంద్ర మంత్రికి  పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో కడపకు బయలుదేరారు. నేటి నుంచి జిల్లాలో పర్యటించనున్నారు.