News January 9, 2026
అన్నమయ్య జిల్లా ఫైర్ ఆఫీసర్‌గా ఆదినారాయణ రెడ్డి

అన్నమయ్య జిల్లా ఫైర్ ఆఫీసర్‌గా ఆదినారాయణ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుమల నుంచి బదిలీపై ఆయన వచ్చారు. జిల్లా పరిధిలోని స్టేషన్ ఫైర్ ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అగ్నిమాపక శాఖ పనితీరు, అత్యవసర సేవలు, భద్రత చర్యలపై చర్చించారు. ఇంతకుముందు అన్నమయ్య జిల్లా డిస్టిక్ ఫైర్ ఆఫీసర్‌గా పనిచేసిన అనిల్ కుమార్ గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యారు.
Similar News
News February 13, 2026
BREAKING: కేసముద్రంలో హంగ్.. CONGRESS 8, BRS 8

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8, BRS 8 గెలిచాయి. కాగా అధికార, ప్రతిపక్ష పార్టీలు సమానంగా వార్డులు గెలవడంతో కేసముద్రంలో ఏం జరుగుతుందోనని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
News February 13, 2026
మున్సిపల్ ఫలితాలు.. పలుచోట్ల హంగ్

TG: మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల హంగ్ ఏర్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 6, BRS 4, బీజేపీ 1, స్వతంత్రులు 1 చోట గెలిచారు. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8, BRS 5, బీజేపీ 1, స్వతంత్రులు 2 చోట్ల గెలిచారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 16 స్థానాలు ఉండగా కాంగ్రెస్, BRS చెరో 8 చోట్ల గెలిచాయి.
News February 13, 2026
సూర్యాపేట: బ్యాలెట్ బాక్సులో పెన్షనర్ ఆవేదన

సూర్యాపేట 35వ వార్డు ఉప ఎన్నికల లెక్కింపులో ఓ విశ్రాంత ఉద్యోగి రాసిన లేఖ కలకలం రేపింది. “రిటైరై 15 నెలలైనా బకాయిలు అందలేదు. వైద్యం అందక ఇప్పటికే 62 మంది సహచరులు మరణించారు. మేము బతికుండగానే మా పైసలు మాకు ఇవ్వండి” అంటూ ప్రభుత్వానికి తన గోడును వెళ్లబోసుకున్నారు. ఓట్ల పెట్టెలో ప్రత్యక్షమైన ఈ లేఖ ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.


