News December 3, 2025

అన్నమయ్య జిల్లా రైతులకు గమనిక

image

అన్నమయ్య జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్లు JC ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. రైతుల సౌకర్యార్థం రాయచోటి, నిమ్మనపల్లె, రామాపురం,వీరబల్లి, గాలివీడు తదితర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం సాధారణ వరి క్వింటాకు రూ.2,369, గ్రేడ్–ఏ వరి క్వింటాకు రూ.2,389 చెల్లిస్తామన్నారు.

Similar News

News December 3, 2025

ఇది ‘RU-KO’ షో

image

రాయ్‌పూర్ వేదికగా SAతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. ఓపెనర్లు జైస్వాల్(22), రోహిత్(14) నిరాశపరిచారు. కానీ, రుతురాజ్ , కోహ్లీ మాత్రం ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కోవడమే కాకుండా ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. రెగ్యూలర్‌గా మనం రోహిత్-కోహ్లీ(RO-KO) షో చూస్తూ ఉంటాం. ఇవాళ మాత్రం రుతురాజ్-కోహ్లీ(RU-KO) షో చూస్తున్నాం. 28 ఓవర్లకు భారత్ స్కోర్ 193-2.

News December 3, 2025

మైక్రో అబ్జర్వర్లు పకడ్బందీగా విధులు నిర్వహించాలి: మస్రత్ ఖానం

image

మైక్రో అబ్జర్వర్లు తమ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం సూచించారు. బుధవారం నిర్మల్ కలెక్టరేట్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఆమెతో పాటు కలెక్టర్ అభిలాష అభినవ్ ఉన్నారు.

News December 3, 2025

కాకినాడ: వణికిస్తున్న స్క్రబ్ టైఫస్.. ‘ఆ లక్షణాలు కనిపిస్తే డేంజరే…’

image

కాకినాడ జిల్లాను స్క్రబ్ టైఫస్ పంజా విసురుతోంది. జనం వణికిపోతున్నారు. మంగళవారం సాయంత్రానికి 142 కేసులు నమోదైనట్లు DMHO నరసింహనాయక్ తెలిపారు. ఈ పరీక్షలు చేసేందుకు గ్రామాలలో వెసులుబాటు లేదు. ఎవరైనా జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడితే నేరుగా PHCకి రావాలని వైద్యులు సూచిస్తున్నారు. అక్కడ వైద్యులు పరీక్షించి నిర్ధారణ కోసం కాకినాడ GGHకి తరలిస్తున్నారు. మారుమూల గ్రామాలలో ఈ వైరస్ విసిరిస్తోందని DMHO తెలిపారు.