News February 24, 2025
అన్నమయ్య జిల్లా TODAY TOP NEWS

➢ ఏసీబీకి చిక్కిన అన్నమయ్య జిల్లా అధికారి
➢ కలికిరి: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
➢ మదనపల్లె: మారణాయుధాలతో దాడి.. 10 మంది అరెస్ట్
➢ జగన్ రెడ్డి.. నీ నాటకాలు కట్టిపెట్టు: చమర్తి
➢ మదనపల్లె: పాలిటెక్నిక్ కాలేజీలో రేపు జాబ్ మేళా
➢ పీలేరు: వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా లోకనాథం
➢ నా రాజకీయ ప్రయాణం లోకేశ్ సారథ్యంలోనే: మేడా
➢ మదనపల్లె: మహిళపై పశువుల కాపర్లు దాడి
Similar News
News December 30, 2025
నాడు 4.. నేడు 3.. అరకు పార్లమెంట్ ప్రస్థానంలో మరో మలుపు

జిల్లాలుగా మారుతున్న పరిపాలన రేఖలు అరకు పార్లమెంట్ స్వరూపాన్ని మారుస్తున్నాయి. 2008లో నాలుగు జిల్లాల పరిధిలో ఏర్పడిన ఈ నియోజకవర్గం, 2021లో రెండు జిల్లాలకే పరిమితమైంది. తాజాగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుతో ఇది పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం అనే మూడు జిల్లాల కలయికగా రూపుదిద్దుకోనుంది. ఈ మార్పు మన్యం రాజకీయాల్లో నూతన అధ్యాయానికి తెరలేపనుంది.
News December 30, 2025
నిమ్మలో గానోడెర్మా తెగులు – నివారణ

నిమ్మచెట్ల కాండంపై పుట్టగొడుగుల మాదిరిగా ఏర్పడి చెట్లు క్షీణించడాన్ని గానోడెర్మా తెగులు అంటారు. పుట్టగొడుగులు లాంటివి కాండంపై గుర్తిస్తే చాకుతో వాటిని తీసివేసి, కాల్చి వేయాలి. తర్వాత తెగులు సోకిన భాగాలపై బోర్డోపేస్టును పూయాలి. 1 శాతం బోర్డో మిశ్రమాన్ని లేదా లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. చొప్పున కలిపిన ద్రావణాన్ని పీచువేర్లు తరలించేటట్లు పాదుల్లో పోయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News December 30, 2025
HYD: మహిళలకు ఉచిత శిక్షణ

HYDలో మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదంగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం, HYD పోలీసుల సహకారంతో MOWO Social Initiatives భాగస్వామ్యంతో ప్రత్యేక డ్రైవర్ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. మహిళా ప్రయాణికుల కోసం బైక్ టాక్సీ, e-ఆటో డ్రైవింగ్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. ఉచిత శిక్షణ, లైసెన్స్ సాయం, వాహన లీజ్/ లోన్ సదుపాయం అందించనున్నారు. JAN3న అంబర్పేట్ PTCలో ఈ మేళా జరగనుంది.


