News September 13, 2025
అన్నమయ్య: టాప్ గ్రేడ్ బొప్పాయి ధర KG రూ.8

సెప్టెంబర్ 13వ తారీఖున టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.8గా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. సెకండ్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.7గా నిర్ణయించారు. అన్నమయ్య జిల్లాలో ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు కొంటె వారిపై ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూమ్ (9573990331, 9030315951)ను సంప్రదించవచ్చని రైతులకు సూచించారు.
Similar News
News April 13, 2026
తూప్రాన్: తల్లిదండ్రులకు విజయాన్ని అంకితం చేసిన శ్రావణి

తూప్రాన్ ఎంజేపీ బాలికల కళాశాల విద్యార్థిని శ్రావణి ఇంటర్ ఎంపీసీలో 950 మార్కులతో సత్తా చాటింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా.. పట్టుదలతో చదివి ఈ విజయం సాధించింది. టెన్త్ బోనాల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసిన శ్రావణి.. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంటర్‌లో రాణించింది. తన విజయాన్ని అమ్మానాన్నలకు అంకితం చేస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని శ్రావణి పేర్కొంది.
News April 13, 2026
సిద్దిపేట TSRSలో 100 శాతం ఉత్తీర్ణత

సిద్దిపేట జిల్లా తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సృష్టించింది. మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి పరీక్షలు రాసిన మొత్తం 159 మంది విద్యార్థులు పాస్ అయ్యారని ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా సెకండియర్‌లో అర్చన 1000కి 994 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.
News April 13, 2026
నేడు RRతో SRH ఢీ.. పరుగుల వరద ఖాయం!

IPLలో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 4 మ్యాచుల్లోనూ గెలిచి RR దూకుడు మీద ఉంది. పైగా వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ చెలరేగి ఆడుతున్నారు. మరోవైపు SRH 4 మ్యాచుల్లో 3 ఓటములు చవిచూసింది. నేటి మ్యాచులో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.


