News April 7, 2025
అన్నమయ్య: డిప్యూటీ కలెక్టర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం

సంబేపల్లె మండలం, యర్రగుంట్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమాదేవి మృతిచెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు నారా చంద్రబాబునాయుడు సూచించారు.
Similar News
News April 12, 2025
పాఠ్యాంశాల్లో ‘వనజీవి’ జీవిత కథ

TG: వనజీవి <<16071045>>రామయ్య<<>> అసలు పేరు దరిపల్లి రామయ్య. వృక్షో రక్షతి రక్షితః అంటూ మొక్కల పెంపకాన్ని ప్రచారం చేశారు. తన కుటుంబ సభ్యులకు చెట్ల పేర్లను పెట్టడం ప్రకృతి పట్ల ఆయన ప్రేమకు నిదర్శనం. గత ప్రభుత్వం హరితహారంలో ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇంటికి ఎవరు వచ్చినా ఒక మొక్కను గిఫ్ట్‌గా ఇచ్చేవారు. ఆయన కృషిని గౌరవిస్తూ ప్రభుత్వం 6వ తరగతి పాఠ్యాంశాల్లో రామయ్య జీవితాన్ని చేర్చింది.
News April 12, 2025
పా.గో: రూ.కోట్లలో వసూళ్లు.. ఒకరికి రిమాండ్: CID

కామవరపుకోట మండలం తడికలపూడి హర్షిత ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ నందిగం ధర్మరాజును రాజమండ్రి CID పోలీసులు నిన్న అరెస్టు చేశారు. స్కూల్ నిర్వాహకులు నందిగం రాణి- ధర్మరాజు 15 మందిని మోసగించి రూ.కోట్లలో వసూలు చేశారని CID డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఈ కేసులో 3వ నిందితుడైన ధర్మరాజును అరెస్టు చేసి గుంటూరు జైలుకు రిమాండ్‌లో తరలించామన్నారు. అటు రూ.14.74కోట్ల ఆస్తి జప్తు చేయాలని ఆదేశాలు ఉన్నాయన్నారు.
News April 12, 2025
పెద్దపల్లి: బాలికపై యువకుడి అత్యాచారయత్నం.. అరెస్టు

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లిలో జరిగింది. ఎస్ఐ సనత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నవదీప్ (22) గురువారం మధ్యాహ్నం అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. తల్లి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. శుక్రవారం నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచామని పేర్కొన్నారు.