News April 8, 2025
అన్నమయ్య : డిప్యూటీ కలెక్టర్ మృతి.. ప్రమాదం జరిగింది ఇలా..!

పీలేరు హంద్రీనీవా సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న రమ (56) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె సోమవారం ఉదయం రాయచోటిలో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు కారులో వెళ్తుండగా సంబేపల్లిలోని ఎర్రగుంట్ల బస్టాండ్ సమీపంలో, గల్ఫ్‌కు వెళ్లేందుకు చెన్నై వెళ్తున్న కారు ఢీ కొట్టింది. రమ అక్కడికక్కడే చనిపోగా.. ఆమె డ్రైవర్ ముబారక్, అటెండర్ జీరూనాయక్, ఢీ కొట్టిన కారు డ్రైవర్ గాయపడ్డారు.
Similar News
News April 17, 2025
IPL: మ్యాచ్ టై.. తొలి సూపర్ ఓవర్

DCvsRR మ్యాచ్ టైగా ముగిసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా స్టార్క్ అద్భుత బౌలింగ్ చేసి 8 పరుగులే ఇచ్చారు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. RR టాప్ ఆర్డర్ శాంసన్, జైస్వాల్, నితీశ్ రాణా రాణించినా ఆ జట్టు గెలవలేకపోయింది. కాసేపట్లో ఈ సీజన్లో తొలి సూపర్ ఓవర్ జరగనుంది.
News April 17, 2025
జాట్ సినిమాపై క్రైస్తవుల ఆందోళన

సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన జాట్ సినిమాపై పంజాబ్‌లో క్రైస్తవుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో క్రిస్టియన్స్ మతవిశ్వాసాలను కించపరిచే సన్నివేశాలున్నాయని, మూవీని బ్యాన్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ సన్నివేశాల్ని 48గంటల్లో తొలగించాలని అల్టిమేటం జారీ చేశారు.
News April 17, 2025
NGKL:ఆ చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ..భూభారతి చట్టంపై ఏప్రిల్ 17నుంచి 30వరకు రైతులకు మండలాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.