News January 3, 2026

అన్నమయ్య: డ్రోన్ కెమెరాతో తనిఖీలు

image

అన్నమయ్య జిల్లాలోని విద్యాసంస్థల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచి ఆకతాయిల ఆటకట్టిస్తున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మదనపల్లె, పీలేరు, రాయచోటి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని విద్యా సంస్థలవద్ద డ్రోన్‌తో శుక్రవారం తనిఖీలు చేశారు. ఆకతాయిల ఆగడాలు, ఈవ్ టీజింగ్‌ను అరికడతామన్నారు.

Similar News

News January 4, 2026

ప.గో: అక్క అనే పిలుపునకు అండగా నిలిచి.. తలకొరివి పెట్టి మానవత్వం చాటి..

image

రక్త సంబంధం లేకపోయినా చిన్న పిలుపుతో ఏర్పడిన అనుబంధం మానవత్వాన్ని చాటింది. బ్రాడీపేటకు చెందిన కొరటాని శ్రీను(45) శనివారం అనారోగ్యంతో మృతి చెందగా, బంధువులు ఎవరూ రాలేదు. దీంతో శ్రీను ‘అక్క’ అని పిలిచే పొరుగున ఉన్న పతివాడ మావూళ్లమ్మ చలించిపోయింది. తానే స్వయంగా తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఆమె చూపిన ఈ చొరవను చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటూ, మావూళ్లమ్మ పెద్దమనసును అభినందించారు.

News January 4, 2026

నవీన్ రావుకు నోటీసులు

image

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. MLC నవీన్ రావు ఇవాళ 11amకు జూబ్లీహిల్స్ PSలో విచారణకు హాజరుకావాలని SIT నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక డివైజ్‌తో ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు దర్యాప్తు బృందం భావిస్తోంది. దీనిపై ఇవాళ ప్రశ్నించే అవకాశముంది. తెలంగాణ ఉద్యమంలో KCR వెంట ఉన్న నవీన్‌కు 2019లో BRS MLC పదవి ఇచ్చింది.

News January 4, 2026

జగిత్యాల: గోదావరి పుష్కరాల్లో 4.50 కోట్ల భక్తులకు ఏర్పాట్లు

image

జగిత్యాల జిల్లాలో ప్రవేశించే గోదావరి నది తీరం వెంట ఉన్న గ్రామాల్లో అవసరమైన చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కర స్నానాలకు అనువుగా ఉన్న గోదావరి తీర ప్రాంతాలైన ధర్మపురి, కోటిలింగాలలో భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. 2015 పుష్కరాలకు 1.50 కోట్ల మంది భక్తులు రాగా, 2027లో జరిగే పుష్కరాలకు సుమారు 4.50 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశముందని అంచనా వేశారు.