News December 8, 2025

అన్నమయ్య: పదో తరగతి విద్యార్థులకు గమనిక

image

మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది. అన్నమయ్య జిల్లా DEO సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 12 వరకు, రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 15 వరకు, రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 18 వరకు విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవాలని సూచించారు.

Similar News

News December 10, 2025

రామచంద్రపురం రెవిన్యూ డివిజన్, DSP ఆఫీస్ యథాతదం- మంత్రి సుభాష్

image

రామచంద్రపురం రెవిన్యూ డివిజన్, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయ(డీఎస్పీ ఆఫీస్) యథావిధిగా రామచంద్రపురం కేంద్రంగా కొనసాగుతాయని సీఎం చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని కార్మికశాఖ మంత్రి సుభాష్ పేర్కొన్నారు. ఈ అంశంపై బుధవారం అమరావతిలో సీఎంతో తాను సమావేశమైనట్లు ఒక ప్రకటన ద్వారా మంత్రి తెలిపారు. నియోజవర్గ ప్రజలు ఈ విషయంలో ఆందోళన చెందవద్దని మంత్రి పేర్కొన్నారు. అపోహలు నమ్మవద్దని మంత్రి సూచించారు.

News December 10, 2025

విద్యావ్యాప్తితో జిల్లా పేరును నిలపాలి: కలెక్టర్

image

విద్యావ్యాప్తి ద్వారా జిల్లా పేరు ప్రఖ్యాతులను రాష్ట్ర స్థాయిలో ఇనుమడింపజేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, విద్యాశాఖ అధికారి పడాల నాగేశ్వరరావుకు సూచించారు. బుధవారం ఇన్‌ఛార్జి DEOగా బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ DEOకు పలు సూచనలు చేశారు. జిల్లా విద్యావ్యవస్థకు దార్శనిక నాయకత్వం వహించి దిక్సూచిలా పనిచేయాలని ఆయన సూచించారు.

News December 10, 2025

సంగారెడ్డి: 18 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 18, 19 తేదీల్లో ప్రాథమిక ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రోజుకు 50 శాతం చొప్పున ఉపాధ్యాయులు హాజరుకావాలని పేర్కొన్నారు. 21, 23 తేదీల్లో ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు.