News March 19, 2025

అన్నమయ్య: పుట్టిన రోజే మృతి

image

పుట్టిన రోజు సరదాగా స్నేహితుడితో వెళ్లిన వారికి అదే చివరి రోజు అయింది. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా పీటీఎం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీనివాసులు(22)ది సోమవారం పుట్టినరోజు. తన స్నేహితుడు చందు(22)తో బి.కొత్తకోటలో సినిమా చూడటానికి వెళ్లారు. ఇంటికి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Similar News

News March 19, 2025

వేసవిలో కూల్ వాటర్ తాగుతున్నారా?

image

వేసవిలో రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన నీటిని తాగవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండవేడికి తాళలేక చల్లగా ఉన్న నీటిని తాగితే శరీరం వాటిని తీసుకోలేదు. దీంతో తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. జీర్ణాశయం పనితీరు నెమ్మదించి మలబద్ధకం, అజీర్తి సమస్యలు ఏర్పడుతాయి. ఎండ నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీరు తాగితే జలుబు, గొంతు మంట వచ్చే అవకాశముంది. దంతాలు దెబ్బతినే ఛాన్స్ ఉంది. మట్టికుండలోని నీరు తాగడం ఉత్తమం.

News March 19, 2025

కర్నూలు: లంచం కోసం ఎస్ఐ అరాచకం.. మంగళసూత్రం తాకట్టు పెట్టించి..!

image

ఆస్పరి SI వెంకట నరసింహులు సస్పెన్షన్‌కు గురయ్యారు. చిత్తూరు జిల్లా సోమల పీఎస్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ నుంచి లంచం తీసుకున్న ఘటనలో సస్పెండ్ చేశారు. 2023లో ఓ మహిళ అదృశ్యమవ్వడంతో భర్త ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఆమె స్టేషన్‌కు చేరుకుని తన భర్తతో కలిసి ఉంటానని చెప్పింది. అందుకు ఎస్ఐ రూ.లక్ష డిమాండ్ చేసి, మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టించాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.

News March 19, 2025

పల్నాడులో రాజకీయ ఆసక్తి రేపుతున్న మర్రి రాజీనామా

image

YCPకి MLC మర్రి రాజశేఖర్‌ రాజీనామా చర్చనీయాంశమైంది. 2004లో చిలకలూరిపేటలో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆయన 2010లో YCPలో చేరారు. 2014లో MLAగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం YCP జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2018లో జగన్‌ పాదయాత్రలో కీలకంగా పనిచేశారు. కాగా 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా విడదల రజనీ ఉన్నారు. పార్టీలో గుర్తింపు లేదని ఆయన అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.

error: Content is protected !!