News March 1, 2026

అన్నమయ్య: ప్రేమ పెళ్లి.. PSలో కౌన్సిలింగ్

image

అన్నమయ్య జిల్లా రామసముద్రం (M) దొడ్డిపల్లికి చెందిన సంతోశ్, భవాని అనే ప్రేమ జంట వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పెద్దలు, గ్రామస్థుల సమక్షంలో చర్చించి వివాహం చేసుకున్నట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం జంటను అబ్బాయి తరఫు బంధువులకు అప్పగించారు.

Similar News

News March 2, 2026

డీల్‌కు అతి చేరువలో ఉండగా US దాడి చేసింది: ఇరాన్ మంత్రి

image

అణు ఒప్పందానికి అతి చేరువలో ఉండగా US దాడులు చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయిద్ అబ్బాస్ అరాఘ్చి విమర్శించారు. చర్చలు జరుగుతుండగానే దాడులు చేసి దౌత్యాన్ని ట్రంప్ నాశనం చేశారన్నారు. చివరగా జెనీవాలో చర్చలు జరిగాక వచ్చే సమావేశంలో ఈ డీల్ ఖాయం చేసుకోవాలని అనుకున్నామని తెలిపారు. కాగా ఇరాన్‌ డీల్‌కు సుముఖంగానే ఉన్నా ట్రంప్ కావాలనే దాడులు చేయించినట్లు వెస్ట్ మీడియాలో పలు ఆరోపణలు వస్తున్నాయి.

News March 2, 2026

కామారెడ్డి: ‘ఆపరేషన్ కవచ్’ సక్సెస్

image

కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ కవచ్’ సత్ఫలితాలను ఇస్తోంది. రామారెడ్డి(M) పోసానిపేట వాసి పెంటయ్య ట్రాక్టర్‌ను నిందితులు దొంగిలించి బాన్సువాడలో విక్రయించేందుకు తరలిస్తుండగా ఆదివారం పద్మాజీవాడి X రోడ్డు వద్ద ‘ఆపరేషన్ కవచ్’ తనిఖీల్లో భాగంగా గాంధారి SI ఆంజనేయులు అడ్డుకున్నారు. నిందితులు గండ్ర స్వామి, వడ్ల విజయ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు.

News March 2, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 2)

image

* 1933: బాలీవుడ్ సంగీత దర్శకుడు పద్మశ్రీ ఆనంద్‌జీ వీర్జీ షా జననం
* 1936: రంగస్థల నటుడు అబ్బూరి గోపాలకృష్ణ జననం
* 1962: తెలంగాణ కవి యాకూబ్ జననం
* 1938: నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు మరణం
* 1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత కోకిల సరోజిని నాయుడు మరణం (ఫొటోలో)
* 1990: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా మంత్రి మసూమా బేగం మరణం