News January 14, 2026

అన్నమయ్య: భార్య మరణవార్త విని భర్త మృతి

image

‘ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి’ 60 ఏళ్ల కిందట వివాహ సమయంలో ఆ దంపతులు చేసిన ప్రమాణం ముందు మృత్యువు తలవంచింది. బి.కొత్తకోట (M) అమరనారాయణ పురానికి చెందిన అంజమ్మ(85),శ్రీరాములు(90)దంపతులు. వృద్ధాప్యం వరకూ అన్యోన్యంగా ఉన్నారు. మంగళవారం ఉదయం అంజమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. భార్య మృరణవార్త విన్న శ్రీరాములు కూడా కుప్పకూలి మృతి చెందాడు.

Similar News

News April 13, 2026

ఈ నెల 30 దాకా రేషన్ పంపిణీ!

image

TG: 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో రేషన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు తీసుకోకపోతే మళ్లీ 3 నెలల వరకు ఇవ్వరని ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే క్యూలైన్లు కనిపిస్తున్నాయి. సర్వర్ సమస్యలు, ఈపోస్ మెషీన్లు ఆగిపోవడం, స్టాక్ అయిపోవడంతో చాలా మందికి ఇంకా రేషన్ అందలేదు. దీంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఈ నెల 30 దాకా రేషన్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు.

News April 13, 2026

తూప్రాన్: తల్లిదండ్రులకు విజయాన్ని అంకితం చేసిన శ్రావణి

image

తూప్రాన్ ఎంజేపీ బాలికల కళాశాల విద్యార్థిని శ్రావణి ఇంటర్ ఎంపీసీలో 950 మార్కులతో సత్తా చాటింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా.. పట్టుదలతో చదివి ఈ విజయం సాధించింది. టెన్త్ బోనాల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసిన శ్రావణి.. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంటర్‌లో రాణించింది. తన విజయాన్ని అమ్మానాన్నలకు అంకితం చేస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని శ్రావణి పేర్కొంది.

News April 13, 2026

సిద్దిపేట TSRSలో 100 శాతం ఉత్తీర్ణత

image

సిద్దిపేట జిల్లా తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సృష్టించింది. మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి పరీక్షలు రాసిన మొత్తం 159 మంది విద్యార్థులు పాస్ అయ్యారని ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా సెకండియర్‌లో అర్చన 1000కి 994 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.