News March 21, 2025

అన్నమయ్య: మహిళను రేప్ చేసిన వ్యక్తిపై కేసు.!

image

మహిళను నమ్మించి నయవంచనకు గురి చేయడమే కాకుండా, అత్యాచారానికి పాల్పడి ఆపై అబార్షన్ చేయించిన వ్యక్తిపై మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. సీఐ ఎరిసావలి తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె బెంగళూరు రోడ్డులోని ఓ ఆసుపత్రిలో మేనేజర్‌గా పనిచేస్తున్న రాజేశ్ అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్స్‌పై అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Similar News

News October 24, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

*త్వరలో ‘సమగ్ర లైఫ్ సైన్సెస్’ పాలసీ.. 2030కల్లా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా రోడ్ మ్యాప్: మంత్రి శ్రీధర్ బాబు
*గిరిజన ఆశ్రమ స్కూల్స్, హాస్టల్స్‌ డైలీవేజ్ వర్కర్లకు తగ్గించిన జీతాలు చెల్లిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ
*నాపై KTR చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తా: మంత్రి జూపల్లి కృష్ణారావు
*రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తించి, ఉత్పత్తి చేసేలా ప్లాంట్ ఏర్పాటుకు NFTDC సంస్థతో సింగరేణి ఒప్పందం

News October 24, 2025

పుట్టపర్తి సత్యసాయి బాబా సూక్తులు

image

★ మీరు ఎవరికో సేవ చేస్తున్నానని భావిస్తే మీలో అహంకారం పెరిగే అవకాశం ఉంది. నా వారికి నేను చేస్తున్నానని భావించాలి
★ భగవంతుడు లేని ప్రదేశం లేదు. ఇది భగవంతుడు కాదు అని చెప్పడానికి అవకాశమే లేదు
★ రెండు బాధల మధ్య గల విరామమే సుఖం
★ మానవత్వం చాలా ప్రవిత్రమైనది. ఇలాంటి పవిత్రమైన, ప్రియమైన, విలువైన మానవత్వాన్ని వ్యర్థం చేసుకోకూడదు!

News October 24, 2025

సూళ్లూరుపేట: కాళంగి నదిలో వ్యక్తి గల్లంతు

image

దొరవారిసత్రం(M) పోలిరెడ్డిపాలెం సమీపంలోని కాళంగి నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ST కాలనీకి చెందిన ఎనిమిది మంది కమ్మకండ్రిగ సమీపంలో చేపల వేటకు వెళ్లారు. వారిలో M పోలయ్య(31) చేపలు పడుతూ ప్రమాదవశాత్తు జారిపడి నది ప్రవాహానికి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న సీఐ సంగమేశ్వరరావు, MRO శైల కుమారి, SI అజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వారు NDRF బృందానికి తెలియజేయగా గాలింపు చర్యలు చేపట్టారు.