News December 25, 2024
అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారంపై నారా లోకేశ్ స్పందన

తిరుపతిలోని అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘జగన్ తిరుమల తిరుపతిని నువ్వు, నీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్టు పట్టించినది చాలక ఇప్పుడు మళ్లీ విష ప్రచారానికి బరితెగించావు. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు శాంటా క్లాస్ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది. అయినా ఫేక్ ప్రచారాలు ఆపడం లేదు.’ అంటూ ట్విట్టర్‌లో విమర్శించారు.
Similar News
News February 17, 2026
సర్టిఫికెట్ల పరిశీలనకు DEOకు లేఖ: CDPO

అంగన్వాడీ ఉద్యోగాలకు అభ్యర్థులు సమర్పించిన టెన్త్ సర్టిఫికెట్లను పరిశీలించాలంటూ DEOకు లేఖ రాసినట్లు కుప్పం CDPO చంద్రకళ తెలిపారు. అయితే, కలెక్టర్ ద్వారా ఆదేశాలు రావాలని DEO చెప్పడంతో కడ PD ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సర్టిఫికెట్లు ఒరిజినల్ Or ఫేక్ అన్నది విద్యాశాఖ అధికారుల విచారణలో తేలాల్సి ఉందన్నారు. కుప్పంలో 10th ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వని వారిని రిజెక్ట్ చేసినట్లు తెలిపారు.
News February 17, 2026
చిత్తూరు: అంగన్వాడీ ఉద్యోగాల్లో అవకతవకలు.?

జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు నిర్వహించిన ఇంటర్వ్యూలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కుప్పం(M)లో ఇంటర్వ్యూలకు కొందరు కలర్ జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరయ్యారు. వాటిని అధికారులు రిజెక్ట్ చేశారు. కొంతమంది National institute of Open Schoolలో 10th చదివినట్లు సర్టిఫికెట్లు చూపించి ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. ఇలాంటి సర్టిఫికెట్లతో మరెంత మంది ఉద్యోగాల్లో చేరారన్నది చర్చనీయాంశంగా మారింది.
News February 17, 2026
మదనపల్లె: నిందితుడి ఇంట్లోనే బాలిక డెడ్‌బాడీ!

మదనపల్లెలో చిన్నారి <<19166799>>హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. నిందితుడి ఇంట్లోనే బాలిక మృతదేహం ఉంది. పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఇప్పటికీ అప్పజెప్పలేదు. ఇంట్లోకి వెళ్లకుండా బాలిక బంధువులు, స్థానికులు అడ్డుకుంటున్నారు. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి కడప ఎస్పీ విశ్వనాథ్ వచ్చారు. మరికాసేపట్లో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సైతం రానున్నారు.


