News October 30, 2025

అన్నమయ్య: ‘సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

అన్నమయ్య జిల్లా ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ధీరజ్ సూచించారు. స్కాలర్‌షిప్‌లు, తుఫాను పరిహారం పేరుతో విద్యార్థులు, రైతులను లక్ష్యంగా చేసుకుని మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని హెచ్చరించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే 1930 నంబర్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Similar News

News November 1, 2025

‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది’ అంటూ యాడ్!

image

పాన్ కార్డు, బర్త్, స్టడీ సర్టిఫికెట్స్ పోయాయని కొందరు పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటాం. అయితే అస్సాంలోని ఓ వార్తాపత్రికలో తన డెత్ సర్టిఫికెట్ పోయిందని యాడ్ రావడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. రంజిత్ చక్రవర్తి అనే వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ లంబ్డింగ్ బజార్‌లో పోయిందని ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు దీనిపై స్పందించకపోయినా, ఈ తప్పు ప్రకటన ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

News November 1, 2025

వరి పొలం గట్లపై కంది మొక్కల పెంపకంతో ఏమిటి లాభం?

image

AP: కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి సాగు చేస్తున్న పొలాల గట్లపై రైతులు కందిని సాగు చేస్తున్నారు. దీని వల్ల కంది పంట పొలం తయారీకి, పురుగు మందుల కోసం చేసే ఖర్చు ఉండదు. వరికి పెట్టే నీటినే కంది మొక్కలు పీల్చుకొని పెరుగుతాయి. వరి పూత దశలో ఆశించే పురుగులను కంది ఆకర్షించి ఎర పైరుగా పని చేస్తుంది. రైతులకు రెండు పంటల దిగుబడి వస్తుంది. ఇలా పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది విత్తనాలను అందిస్తోంది.

News November 1, 2025

ఎల్లుండి నుంచి ప్రైవేటు కాలేజీల బంద్!

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో ₹900Cr చెల్లించాలంటూ ప్రైవేటు కాలేజీలు విధించిన డెడ్‌లైన్ నేటితో ముగిసింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఎల్లుండి(NOV 3) నుంచి నిరవధిక బంద్‌కు కాలేజీలు సిద్ధమవుతున్నాయి. 2024-25 వరకు ₹9వేల కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దసరాకు ముందు ₹1,200Cr రిలీజ్ చేస్తామన్న ప్రభుత్వం ₹300Cr మాత్రమే చెల్లించిందని యాజమాన్యాలు చెబుతున్నాయి.