News February 18, 2026
అన్నమయ్య: హాల్ టికెట్ల విడుదల ఎప్పుడంటే?

అన్నమయ్య జిల్లాలో మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. సంబంధిత హాల్ టికెట్లు మార్చి మొదటి వారంలో విడుదల అవుతాయని DEO సుబ్రహ్మణ్యం తెలిపారు. బోర్డ్ వెబ్‌సైట్, పాఠశాల లాగిన్‌లు, LEAP యాప్, వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. పాఠశాలలు విద్యార్థుల వివరాలను సరిపోల్చి పరిశీలించాలని.. పొరపాట్ల సవరణకు UDISE విండో మార్చి 31వ తేదీ వరకు ఉంటుందన్నారు.
Similar News
News February 18, 2026
జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. ధంసలాపురం ఎంట్రీ, ఎగ్జిట్‌కు 1.38 ఎకరాల భూసేకరణ త్వరగా పూర్తి చేసి మార్చి 15లోపు పనులు ముగించాలని ఆదేశించారు. నాగపూర్- అమరావతి హైవే ప్యాకేజీలకు కొనిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో భూ స్వాధీనం వేగవంతం చేయాలన్నారు. 17 జంక్షన్ల రోడ్డు భద్రతా పనులు నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించారు.
News February 18, 2026
పెద్దపల్లి: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

NHM జేఏసీ పిలుపుతో “ప్రజాప్రతినిధుల ములాఖాత్” కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావును జేఏసీ ఉద్యోగులు కలిసి వినతి పత్రం అందజేశారు. రెగ్యులరైజేషన్‌తో పాటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలో కూడా రెగ్యులరైజేషన్ చేపట్టేలా ప్రభుత్వానికి సూచించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మహేందర్, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
News February 18, 2026
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ రిజ్వాన్ బాషా

జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌లతో కలిసి పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.


