News August 14, 2025

అన్నమయ్య: PGRSలో ఫిర్యాదు.. ఊరికి వచ్చిన కలెక్టర్

image

గాలివీడు మండలం నూలివీడులోని భూ సమస్యను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి స్వయంగా వెళ్లారు. PGRS ద్వారా ఒక బాధితుడు ఇచ్చిన అర్జీపై స్పందించి బుధవారం మధ్యాహ్నం ఆ గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబంతో మాట్లాడి, సమస్యను పరిష్కరించాలని తహశీల్దార్‌కు ఆదేశించారు. భూ సమస్యలను పరిష్కరించడానికి తహశీల్దార్లు గ్రామాలకు స్వయంగా వెళ్లి ప్రజలతో మాట్లాడాలని సూచించారు.

Similar News

News August 14, 2025

నిర్మల్: ‘కడెం ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తున్నాం’

image

భారీ వర్షాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ తర్వాత, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లాలో చేపట్టిన సహాయక చర్యల గరించి వివరించారు. కడెం ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు. అత్యవసర సహాయం కోసం 24 గంటల కంట్రోల్ రూమ్‌ను (9100577132) ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News August 14, 2025

నిర్మల్: సహాయక చర్యల కోసం జిల్లాకు రూ.కోటి

image

CM రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలకు ప్రతి జిల్లాకు రూ.కోటి కేటాయించడంతో పాటు సీనియర్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులను కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

News August 14, 2025

నంద్యాలలో వెలుగులోకి నకిలీ లెటర్ల మోసం?

image

నంద్యాల కేంద్రంగా టీటీడీ దర్శనం కోసం నకిలీ లెటర్లు తయారుచేసి రూ.వేలకు అమ్ముకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. బైర్మల్ వీధిలో అద్దెకు నివసించే ఓ యువకుడు ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధుల పేర్లతో నకిలీ లెటర్లు తయారు చేస్తున్నట్లు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గుర్తించారు. తాజాగా ఎంపీ బైరెడ్డి శబరి పేరుతో నకిలీ లెటర్ తయారు చేసి నెల్లూరు వాసులకు ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.