News December 26, 2025

అన్నవరంలో ఆగని అపచారాలు!

image

అన్నవరం సత్యదేవుని ఆలయ సిబ్బంది వ్యవహారశైలిపై భక్తులు మండిపడుతున్నారు. కేశఖండశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ క్షురకుడిని ఈవో త్రినాథరావు సస్పెండ్ చేశారు. గురువారం రాత్రి వసతి గదుల కోసం సీఆర్వో కార్యాలయానికి వెళ్లిన వారి పట్ల ఓ ఉద్యోగి దురుసుగా ప్రవర్తించినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు మారినా సిబ్బంది తీరు మారడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 26, 2025

రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయండి: కలెక్టర్

image

సంక్రాంతి వరకు రైతులకు ఏ మేరకు ఎరువులు అవసరమో తెలుసుకుని ఎటువంటి కొరత లేకుండా సరఫరా చేయాలనీ కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో రబీ సీజన్లో ఎరువుల సరఫరా పై అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్షించారు. వారం చివరిలో వచ్చే వారానికి అవసరమయ్యే ఎరువులు ముందుగానే సొసైటీలలో నిల్వ ఉండేలా వ్యవసాయాధికారులు పర్యవేక్షించాలన్నారు.

News December 26, 2025

వేములవాడలో బయటపడిన పురాతన విగ్రహం

image

వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారిలో పురాతన రాతి విగ్రహం బయటపడింది. రోడ్ల విస్తరణలో భాగంగా మురికి కాలువ నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టగా వేణుగోపాలస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న దుకాణాల అడుగు భాగంలో బుద్ధుడి చిత్రాలను పోలివున్న బొమ్మలతో కూడిన పురాతన రాతి విగ్రహం బయటపడింది. విగ్రహాన్ని శుభ్రపరచి వేణుగోపాలస్వామి ఆలయంలో భద్రపరిచారు.

News December 26, 2025

సూర్యాపేట: ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు

image

సూర్యాపేట ఎస్పీ కె.నరసింహ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి మోసాలకు తెరలేపారు. ‘కె.నరసింహ IPS’ పేరుతో అకౌంట్లు తెరిచి, తక్కువ ధరకే ఫర్నిచర్ ఇప్పిస్తామంటూ కొందరికి సందేశాలు పంపారు. ఈ విషయం గమనించిన ఎస్పీ ప్రజలను అప్రమత్తం చేశారు. తన పేరుతో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దన్నారు. డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.