News December 9, 2025

అన్నవరం ఈవో బదిలీ

image

అన్నవరం దేవస్థానంలో వరుస ఘటనలపై Way2Newsలో వార్తా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ప్రభుత్వం ఈవో సుబ్బారావుపై వేటు వేసింది. ఆయనను మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు తిరిగి పంపింది. కొత్త ఈవోగా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ త్రినాధరావును నియమించింది. సుబ్బారావు సర్వీస్ వెనక్కి తీసుకోవడంతో ఆయనపై జరిగిన విచారణ నివేదికపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Similar News

News December 11, 2025

మెదక్ జిల్లాలో 20.52% ఓటింగ్

image

మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, 9 గంటల వరకు 20.52 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వణికించే చలి ఉన్నప్పటికీ ప్రజలు ఉదయం నుంచే ఓటు వేసేందుకు బారులు తీరి ఉన్నట్లు వివరించారు.

News December 11, 2025

HYDకు మెస్సీ.. ఒక్క ఫొటోకి రూ.9.95లక్షలు!

image

‘ద గోట్ టూర్’లో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ ఈ నెల 13న HYDకు రానున్నారు. CM రేవంత్‌తో కలిసి ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడతారు. ఆ రోజున ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ‘మీట్ అండ్ గ్రీట్’ ప్రోగ్రామ్ ఉంటుందని, మెస్సీతో ఫొటో దిగేందుకు రూ.9.95లక్షలు+GST చెల్లించాలని టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతీ రెడ్డి తెలిపారు. 100 మందికే ఈ ఛాన్సని, డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు.

News December 11, 2025

వనపర్తి జిల్లాలో పోలింగ్ శాతం @9AM

image

తొలి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లాలోని ఐదు మండలాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా అధికారులు మండలాల వారిగా ఉదయం 9 గంటల వరకు పోలింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 20.5% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా. ఘన్ పూర్ మండలం- 20%, గోపాల్ పేట్- 17%, పెద్దమందడి- 21.8%, రేవల్లి- 21.1%, ఏదుల 23.6% పోలింగ్ నమోదైంది.