News June 26, 2024

అన్నవరం సత్యదేవుని దర్శన విధానంలో మార్పులు

image

అన్నవరం సత్యదేవుని దర్శన విధానంలో మార్పులు చేపట్టారు. దశమి, ఏకాదశి, పౌర్ణమి తదితర పర్వదినాలు, రద్దీ రోజుల్లో శీఘ్ర దర్శనం రూ.200, ప్రదక్షిణ దర్శనం రూ.300 టికెట్లు మధ్యాహ్నం వరకు నిలిపివేయాలని ఈవో ఆదేశించారు. మధ్యాహ్నం మూడు తరువాతే రూ.300 ప్రదక్షిణ దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఎక్కువ సమయం నిరీక్షించడం, సాధారణ దర్శనానికి వచ్చే వారికి ఇబ్బందులు ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Similar News

News June 29, 2024

నేడు 15 కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి తూ.గో జిల్లాలోని 15 కోర్టులో శనివారం 10 గంటల నుంచి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు శుక్రవారం తెలిపారు. ☞ తూ.గో జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తి☞ కాకినాడ జిల్లాలో కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు☞ కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, ముమ్మిడివరం, కొత్తపేటలో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు.

News June 29, 2024

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: DMHO

image

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు దొర చెప్పారు. ఈ గన్నవరం మండలం బెల్లంపూడి ఎస్సీ పేటలో శుక్రవారం సర్పంచ్ బండి మహాలక్ష్మితో కలిసి పర్యటించారు. సీజనల్ జ్వరాల బాధితుల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, బయట ఆహార పదార్థాలను తీసుకోవద్దని సూచించారు.

News June 28, 2024

ముంపు గ్రామాల్లో అప్రమత్తం: మంత్రి అనిత

image

వరదల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరి ముంపు గ్రామాల్లో ముందస్తు నివారణ చర్యలు చేపట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్‌తో వరద నివారణ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలంలో వరద నివారణ చర్యలపై ప్రత్యేకంగా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.